Donald Trump : ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు నాయకత్వం ఇజ్రాయెల్‌కు ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేస్తూ, తమ చర్చల్లో ఇప్పటికే పలు కీలక సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన మరుసటి రోజే నెతన్యాహుతో సమావేశమైన ట్రంప్, గాజా కాల్పుల విరమణ, ఇరాన్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా అంశాలపై చర్చలు జరిగాయని వెల్లడించారు.
“ఇది చాలా మంచి సమావేశం. కేవలం ఐదు నిమిషాల్లోనే మూడు సమస్యలకు పరిష్కారం దొరికింది” అని ట్రంప్ మీడియాతో చెప్పారు.
Read also: Court Verdict: కుల్దీప్ సెంగార్ విడుదలపై సుప్రీంకోర్టు స్టే రద్దు
నెతన్యాహుకు మద్దతు తెలుపుతూ ట్రంప్ మాట్లాడుతూ, “సరైన ప్రధాని లేకపోతే ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదంలో పడేది” అంటూ ప్రశంసలు కురిపించారు. (Donald Trump) గత ఏడాదిలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్–హమాస్, ఇజ్రాయెల్–ఇరాన్, ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కాల్పుల విరమణలు సాధ్యమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
హమాస్‌తో రెండో దశ కాల్పుల విరమణ త్వరగా అమలవ్వాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. అయితే ఇందుకు హమాస్ ఆయుధాల సమర్పణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే ఈజిప్ట్–గాజా సరిహద్దులోని రఫా క్రాసింగ్‌ను హమాస్ బందీల మృతదేహాలు అప్పగించిన తర్వాతే తెరవాలన్న షరతు పెట్టారు.
ఇరాన్ విషయంలో ట్రంప్ స్పందిస్తూ, అణు, క్షిపణి కార్యక్రమాలు కొనసాగితే ఇజ్రాయెల్ మరోసారి దాడి చేయడాన్ని తాను మద్దతు ఇస్తానన్నారు. హెజ్‌బొల్లాపై కూడా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాదాపు రోజువారీ దాడులు కొనసాగిస్తోందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: