📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: ట్రంప్ మాకొద్దు.. రోడ్డెక్కిన లక్షలమంది పౌరులు

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అక్రమ వలసదారుల అరెస్టులకు ఆదేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అనే నినాదాలతో అమెరికా(america) వీధులు, పార్కులు, ప్లాజాలు హోరెత్తాయి. ఇక ట్రంప్ బర్త్ డే రోజే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగ్గా.. పోర్ట్‌ల్యాండ్‌(Portland)లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సాల్ట్‌లేక్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు.

America: ట్రంప్ మాకొద్దు.. రోడ్డెక్కిన లక్షలమంది పౌరులు

దేశమంతటా ఆందోళనలు
గత వారం లాస్ ఏంజెలెస్‌లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు వలసదారులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత ఈ ఆందోళనలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి. ఆందోళనల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. కొంత మంది గవర్నర్లు నేషనల్ గార్డ్‌లు పరేడ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోర్ట్‌ల్యాండ్‌లో ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
కాల్పుల్లో ఒకరు మృతి
ఇక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాల్ట్‌లేక్ సిటీలోని డౌన్‌టౌన్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని 39 ఏళ్ల ఆర్థర్ ఫొలాసా అహ్ లూగా పోలీసులు గుర్తించారు. 24 ఏళ్ల అర్టురో గంబోవా కాల్పులు జరపడం వల్లే అహ్ లూ మృతిచెందారని నిర్ధారించారు.
తమకు రాజులు అవసరం లేదు
శనివారం రోజున జనమంతా ఒక్కటై అమెరికా కోసం శాంతియుతంగా నిలిచారని.. తమకు రాజులు అవసరం లేదని.. నో కింగ్స్ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ ఏంజెలెస్‌లలో నో కింగ్స్ అని రాసి ఉన్న బ్యానర్లతో వేలాది మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో 5 వేల మందికి సరిపడే వేదిక నిండిపోవడంతో.. వేలాది మంది బయటే ఉండిపోయారు. సియాటిల్‌లో జరిగిన ఆందోళనల్లో ఏకంగా 70 వేల మంది పాల్గొన్నారు. వాషింగ్టన్‌లోని లోగాన్ సర్కిల్‌లో 200 మంది ఆందోళనకారులు ట్రంప్ రాజీనామా చేయాలి అనే నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ట్రంప్ బొమ్మను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. వాషింగ్టన్‌లోని సైనిక పరేడ్‌కు హాజరయ్యారు. శనివారం డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు కావడం, అదే రోజున అమెరికా సైనిక దళాల 250వ వార్షికోత్సవం కావడం విశేషం.

Read Also: Tehran: టెహ్రాన్ ను వీడుతున్న ప్రజలు..ఏటీఎంలపై ఆంక్షలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Millions of citizens Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today took to the streets Trump is not our son

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.