📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్, అసిమ్ మునీర్ భేటీ

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ .. డొనాల్డ్(Asim Munir-Trump) ట్రంప్‌తో లంచ్ చేయనున్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్, అసిమ్ మునీర్ భేటీ కానున్నారు. అయితే జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ(Modi) కెనడా(Canada) చేరుకునే లోపే.. తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ట్రంప్ నిన్న అమెరికా వెళ్లిపోయారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్‌తో వైట్‌హౌస్‌(White House)లో ట్రంప్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక యూఎస్ ఆర్మీ వార్షికోత్సవాలకు అసిమ్ మునీర్ హాజరవుతారని వార్తలు రాగా.. దాన్ని అమెరికా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రాధాన్యతలు మారిపోయాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో అసిమ్ మునీర్ అమెరికాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్, అసిమ్ మునీర్ భేటీ

5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్.. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో వీరిద్దరి లంచ్ భేటీ జరగనుంది. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అసిమ్ మునీర్ ఆ దేశంలో ఐదు రోజుల పర్యటనకు చేరుకున్నారు. అయితే అంతకుముందే ఈనెల 14వ తేదీన జరిగిన యూఎస్ ఆర్మీ 250వ వార్షిక వేడుకలకు అసిమ్ మునీర్ హాజరు కానున్నారనే వార్తలు వైరల్ కాగా.. ఆయనకు ఎలాంటి ఆహ్వానం ఇవ్వలేదని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్, మునీర్ భేటీకి సంబంధించిన వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అమెరికాలో పర్యటిస్తున్న అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా అక్కడి పాకిస్తాన్ పౌరులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ట్రంప్ తో మధ్యాహ్న భోజనం చేయనున్న ఆర్మీ చీఫ్
అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన డైలీ పబ్లిక్ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బుధవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. పాకిస్తాన్ దినపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. ఈ పర్యటనలో అసిమ్ మునీర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌లతో కూడా సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు.. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యమని పేర్కొంది.
ఇరాన్‌ వైపు పాకిస్తాన్ నిలిచింది
మరోవైపు.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఇరాన్‌ వైపు నిలిచింది. ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్తాన్‌ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుబాంబుతో దాడి చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ జనరల్‌, ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మెంబర్‌ మొహ్సెన్‌ రెజాయ్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌ ఇచ్చిన ప్రకటనను పాక్‌ ఖండిచింది. తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్‌ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read Also: Virat Kohli: లండ‌న్‌లోని కోహ్లీ ఇంట్లో గడిపిన భారత క్రికెటర్లు

#telugu News Ap News in Telugu Asim Munir at the Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump meets White House

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.