📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nobel Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ముందంజలో ట్రంప్?

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి(Nobel Prize) బహుమతి రేసులో ముందంజలో ఉన్నారట. అమెరికాకు చెందిన ఓ పత్రిక నుంచి కథనం వెలువడింది. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకునేందుకు ట్రంప్(Trump) ముందు వరుసలో ఉన్నారని.. రోజురోజుకూ ఆయనకు ఉన్న అవకాశాలు మెరుగవుతున్నాయని ఆ కథనం పేర్కొంది. ఈ వార్తతో రిపబ్లికన్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ అధినాయకుడికి ఈ సారి నోబెల్ పీస్ ప్రైజ్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Nobel Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ముందంజలో ట్రంప్?

అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని పొందారు
మార్చి 5న నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ 338 అభ్యర్థులను ఈ ఏడాది నామినేట్ చేసింది. వీరిలో 244 మంది స్వతంత్రులు కాగా 94 సంస్థలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నామినేటెడ్ అభ్యర్థులు పెరిగినట్లు కమిటీ తెలిపింది. 2024లో 286 మందిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు స్పష్టం చేసింది.
ఇక అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. థియోడర్ రోస్ వెల్ట్(1906), వుడ్ రో విల్ సన్(1919), జిమ్మీ కార్టర్(2002), చివరగా బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఈ క్రమంలో ఈ అవార్డును ఎలాగైనా సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ తెగ ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై పెద్దన్న పాత్ర వహిస్తున్నారని పరిష్కారం చూపిస్తూన్నారని ఈ ప్రత్యేక వార్తా కథనం పేర్కొంది.
గతంలోనూ నామినేట్ అయినా ట్రంప్
గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ అయ్యారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ అవార్డు చేజారిపోయింది. అయితే ఈ సారి ప్రెసిడెంట్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారట. వికీ లీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజే, రష్యా ప్రతిపక్షనేత దివంగత అలెక్సీ నావెల్సీ భార్య యూలియా నావల్నయాల కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.
గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి చర్చలు, రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు.. పలు సంస్థలకు దాతృత్వ సేవలు.. తదితర కార్యక్రమాలతో ఆయన ముందంజలోకి దూసుకొచ్చారని తెలుస్తోంది. ఇక నోబెల్ ప్రైజ్ విజేతలను అక్టోబర్ 10 న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లో నగరంలో అందజేస్తారు.

Read Also: Australia Floods : ఆస్ట్రేలియాలో వరద బీభత్సం… నలుగురి మృతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Is Trump leading Latest News in Telugu Nobel Peace Prize Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the race for the

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.