📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

గౌతమ్ అదానీకి ట్రంప్ శుభవార్త

Author Icon By Vanipushpa
Updated: February 11, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్ని నెలల కిందట అదానీ తన వ్యాపారాల డీల్స్ కోసం భారతదేశంలో ప్రభుత్వ అధికారులకు పెద్ద మెుత్తంలో లంచాలు ఇచ్చినట్లు అమెరికా నుంచి వచ్చిన ఆరోపణలు పెద్ద ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు అమెరికాలో రాసిన లేఖ గురించి వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించింది.
అమెరికాలో అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం ఆరోపణల కేసు దర్యాప్తును ప్రారంభించడానికి ఉపయోగించిన దాదాపు అర్ధ శతాబ్దం నాటి చట్టాన్ని నిలిపివేయాలని చేయాలని న్యాయ శాఖను ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయటంతో గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించింది.

ట్రంప్ ఆర్డర్ తో నిలిచిపోనుంది

వాస్తవానికి వ్యాపారం పొందటం లేదా నిలుపుకోవటం కోసం విదేశీ ప్రభుత్వాల అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికన్ కంపెనీలు, విదేశీ సంస్థలు నిషేధించే 1977 విదేశీ అవినీతి పద్ధతుల చట్ట అమలు తాజా ట్రంప్ ఆర్డర్ తో నిలిచిపోనుంది. ఈ వార్త అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతోంది. వాస్తవానికి గత ఏడాది గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై ప్రభుత్వ అధికారులకు లంచం ఎరజూపి వ్యాపారాన్ని పొందారనే అభియోగం యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ నవంబర్ 2024లో పేర్కొంది. వ్యాపారవేత్త అదానీ వేలకోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అందులో పేర్కొనబడింది. లాభదాయకమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్లు లంచం ఇచ్చినందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఆరుగురిపై న్యూయార్క్‌లోని యూఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగం మోపిన సంగతి తెలిసిందే.

ఏపీలో ప్రకంపనలు

ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధం ఉన్నట్లు తేలింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) ద్వారా 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలుకు అగ్రిమెంట్ జరిగింది. దీనిని పొందటానికి ముందు ఆగస్టు-నవంబర్ 2021లో మూడుసార్లు SECI, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కూడా వెల్లడించబడింది. అప్పట్లో అదానీపై వచ్చిన ఆరోపణలతో ఆయన లిస్టెడ్ కంపెనీ షేర్లు పతనం కావటంతో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూశారు.

మార్కెట్ నష్టాల నుంచి తేలుకుంటున్నాయి

ప్రస్తుతం ట్రంప్ ఆర్డర్ అమలులోకి రావటానికి దాదాపు 180 రోజులు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ కాలంలో కేసు విషయంలో కొత్త ఇన్వెస్టిగేషన్ లేదా చట్టపరమైన చర్యలు అదానీతో పాటు అభియోగాలు మోపబడినవారిపై ఉండబోవని తెలుస్తోంది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను నిరాదారమైనవిగా గతంలోనే ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీకి అనుకూలంగా పరిణామాలు మారుతున్న వేళ ఆయన లిస్టెడ్ కంపెనీల షేర్లు క్రమంగా మార్కెట్ నష్టాల నుంచి తేలుకుంటున్నాయి. కొన్ని షేర్లు లాభాల్లో కూడా కొనసాగుతున్నాయి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Donald Trump Gautam Adani good news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.