అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) శ్వేతసౌథంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా(Ramaphosa)తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు ఆర్థిక, వాణిజ్య(Financial, Trade) ఒప్పందాలు జరిగాయి. దక్షిణాఫ్రికా(SouthAfrica)లోని శ్వేత జాతీయులైన రైతులపై జరుగుతున్న దాడులు, వివక్షలపైనా ఇరు దేశాల అధినేతలు చర్చించారు. సౌత్ ఆఫ్రికా(SouthAfrica)లో శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలపై సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశం అనంతరం ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ ఎన్బీసీ న్యూస్ కు చెందిన ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆ జర్నలిస్టుపై ట్రంప్ విరుచుకుపడ్డారు. గెట్ అవుట్ అంటూ శివాలెత్తారు. సదరు రిపోర్టరు అడిగిన సాధారణ ప్రశ్నకే ట్రంప్ ఈ రేంజ్ లో ఫైర్ కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానం గురించి ప్రశ్న..
ఎన్సీబీ న్యూస్ కు చెందిన ఓ రిపోర్టర్ ట్రంప్ ను.. ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానం గురించి ప్రశ్న అడిగారు. అలా విమానం బహుమతిగా తీసుకోవడం నైతికంగా కరెక్టేనా అన్న ప్రశ్నకు ట్రంప్ ఆ రిపోర్టర్ పై విరుచుకు పడ్డారు. గెట్ అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఖతార్ కు చెందిన బోయింగ్ 747 విమానంపై రిపోర్టర్ ప్రశ్న అడగ్గా ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ” మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?..మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఖతార్ జెట్ ప్రశ్న ఇప్పుడు అవసరమా..? మీ ఎన్బీసీ ఛానెల్ వాస్తవాల నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తోంది. మీరు రిపోర్టర్ గా ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. మీరు టెర్రిబుల్ గా ఉన్నారు” అంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు.
ఖతార్ బోయింగ్ 747 విమానం తనకు ఇచ్చింది కాదనీ.. అమెరికా ఎయిర్ ఫోర్స్ కు ఆ దేశం బహుమతిగా ఇచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. అది కూడా టెంపరరీగా మాత్రమేనని.. బోయింగ్ నుంచి విమానాలు వచ్చాక అది ఖతార్ వెళ్తుందని ట్రంప్ అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బోయింగ్ విమానం ఖరీదు 400 మిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం.
ట్రంప్ గ్నీన్ సిగ్నల్
మరోవైపు అమెరికాను మిస్సైల్స్ దాడి నుంచి రక్షించుకునేందుకు ‘గోల్డెన్ డోమ్’ ఏర్పాటుకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. 175 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఈ గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడేళ్లలోనే గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 25 బిలియన్ డాలర్లను మొదటి దశలో ఖర్చు చేస్తామని.. ప్రాజెక్ట్ చివరి దశకు చేరేలోపు 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్మిస్తామని ట్రంప్ వివరించారు. ఇక ట్రంప్ తీసుకొచ్చిన ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ పై రష్యా, చైనా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also: Centre On Waqf Act: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్ట సవరణలపై విచారణ