📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడిని నియమించిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: March 5, 2025 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే వ్యాఖ్యలే కాకుండా పనులు కూడా అందరికీ అదే స్థాయిలో ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. ఎప్పటిలాగే తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుని దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ముఖ్యంగా ఓ 13 ఏళ్ల బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించారు. తన ఎదుటే అధికారిక బ్యాడ్జీ అందజేయాలని చెప్పగా.. అధికారులు ఆ పని చేశారు. ఆపై బాలుడు యూనిఫామ్ వేసుకుని మరీ.. అధికార బాధ్యతలు చేపట్టాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజు 13 ఏళ్ల డీజే డేనియల్‌కు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా ఎంపికయ్యే అరుదైన గౌరవాన్ని ప్రదానం చేశారు. తద్వారా ఈ బిరుదును పొందిన అతి చిన్న వయస్కుడిగా డీజే డేనియల్ నిలిచాడు.

డేనియల్‌ను అధికారికంగా గౌరవ హోదాలో నియమించాలని ట్రంప్ ఆదేశం

ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. మధ్యలో ఈ ప్రకటన చేశారు. ముఖ్యంగా అక్కడే కూర్చుని ఉన్న డీజే డేనియల్‌ను అధికారికంగా గౌరవ హోదాలో నియమించాలని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్‌ను ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో సీక్రట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ వెంటనే అధికారిక బ్యాడ్జ్ అందజేశారు. ఆపై చిన్నారిని కౌగిలించుకున్నారు. ఈ సమయంలో సభలో డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ఉండగా.. అంతా కలిసి చప్పట్లు కొట్టారు. డీజే డీజే అంటూనే బాలుడిని గాల్లోకి ఎత్తగా చిన్నారి సైతం తెగ సంబుర పడిపోయాడు. ఆయన తండ్రి కూడా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అసలు ఎవరీ డేజీ డేనియల్?
డీజే డేనియల్‌కు ప్రస్తుతం 13 ఏళ్ల వయసు. అయితే ఇతడికి 7 ఏళ్ల వయసు ఉండగా అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడికి అరుదైన క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. అంతేకాకుండా 5 నెలల కంటే ఎక్కువగా బతకడని చెప్పారు. తీవ్రమైన దుఃఖంతోనే డేనియల్‌ను కాపాడుకునేందుకు అతడి తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడ్డారు. గత ఆరేళ్లుగా అతడికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూనే.. అతడి కోరికలు తీరుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలు తిప్పుతూ బాలుడిని ప్రాణంగా చూసుకుంటున్నారు.
అయితే డీజే డేనియల్ చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలు కన్నాడట. దేశానికి సేవ చేయాలని అనుకునేవాడట. ఈక్రమంలోనే డేనియల్ తండ్రి అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ విషయం చెప్పగా.. ఆయనే నేరుగా బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మన్ననలను పొందారు.

#telugu News 13-year-old boy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Secret Service agent Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump hires USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.