పరస్పర సుంకాల(Tariff) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా ఫెడరల్ ట్రేడ్ కోర్టు (Federal Trade Court) అడ్డుకుంది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని, అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంచి ఆర్థిక గందరగోళానికి దారితీశారని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యూయార్క్(Newyork)లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అత్యవసర అధికారాల చట్టం కింద దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలను విధించకుండా తీర్పు ఇచ్చింది.
అధ్యక్షుడికి ఇచ్చిన అధికారం మించిపోయింది
సుంకాల ద్వారా దిగుమతిని నియంత్రించడానికి IEEPA చట్టం అధ్యక్షుడికి ఇచ్చిన అధికారం మించిపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. ట్రంప్ వాణిజ్య విధానంలో కేంద్ర బిందువు అయిన టారిఫ్‌లను సవాలు చేస్తూ ఇంతకుముందు ఏడు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుంకాలను సాధారణంగా కాంగ్రెస్ ఆమోదించాలి. కానీ దేశ వాణిజ్య లోటు జాతీయ అత్యవసర పరిస్థితికి సమానం కాబట్టి తనకు చర్య తీసుకునే అధికారం ఉందని ట్రంప్ చెబుతున్నారు. ఒక దశలో ప్రపంచంలోని చాలా దేశాలపై ఆయన సుంకాలను విధించడం వల్ల మార్కెట్లు కుదేలయ్యాయి. న్యూయార్క్‌లోని కోర్టు తీర్పుపై శ్వేతసౌధం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: Israel : చివరి విమానాన్ని ధ్వంసం చేశాం : ఇజ్రాయెల్