📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Russia Ukraine War: పుతిన్​పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం

Author Icon By Vanipushpa
Updated: May 26, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​(Putin)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి ఒకవైపు చర్చలు జరగుతున్న వేళ పుతిన్(Putin) సైన్యం అతిపెద్ద వైమానిక దాడులు చేయడంపై మండిపడ్డారు. పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని తన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ చేశారు.
పూర్తిగా పిచ్చిపట్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు: ట్రంప్
‘రష్యా అధ్యక్షుడు పుతిన్​ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయనతో ఎప్పుడూ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆయనకు ఏదో జరిగింది. పూర్తిగా పిచ్చిపట్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండానే ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. అనవసరంగా చాలా మందిని చంపేస్తున్నారు. పుతిన్ ఉక్రెయిన్​లో కొంత భూభాగాన్ని కాదు, ఆదేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు. కానీ, ఇది రష్యా పతనానికే దారితీస్తుంది.’ అని పేర్కొన్నారు.

Russia Ukraine War: పుతిన్​పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం

యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు. జెలెన్‌స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏమాత్రం మేలు చేయదని అన్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని పునరుద్ఘాటించారు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ రాసుకొచ్చారు.
ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులు చేసింది.

రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా సైన్యం 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్‌ను మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని విమర్శించారు.

Read Also: Vladimir Putin : పుతిన్ హెలికాప్టర్ ను టార్గెట్ చేసిన ఉక్రెయిన్…

#telugu News Ap News in Telugu Breaking News in Telugu deep anger at Putin Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump expresses

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.