📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను తగ్గించిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: May 26, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అమెరికా(America)లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే విదేశీయులు తమ దేశాలకు పంపే నగదుపై పన్నును తగ్గించింది. గతంలో 5% పన్ను విధించనున్నట్టు ప్రకటించిన ప్పటికీ.. దానిని 3.5%కి పరిమితం చేశారు తాజాగా నిర్ణయం అమెరికాలో పనిచేసే భారతీయు(Indians)లకు కొంత ఊరటనిస్తుంది. అమెరికా నుంచి వేరే దేశాలకు డబ్బు పంపేటప్పుడు ‘ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్‌ఫర్స్’ (Remittance Tax) పేరుతో పన్ను వసూలు చేసేలా బిల్లును ట్రంప్ యంత్రాంగం ఈ నెల 12న తీసుకొచ్చింది. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుగా (The Beautiful Bill) అభివర్ణించిన రిపబ్లికన్‌లు.. 5 శాతం పన్ను వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే, విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు దానిని 3.5 శాతానికి తగ్గించారు. ఇప్పుడు అమెరికా నుంచి లక్ష పంపితే రూ.3,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Trump: స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను తగ్గించిన ట్రంప్

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’
డబ్బును బదిలీ చేసే బ్యాంకులు, మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలు ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి అందిస్తాయి. ఈ పన్ను చట్టం బిల్లును ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ పేరుతో రూపొందించారు. అమెరికా ప్రతినిధుల సభ దీనికి ఆమోదం తెలిపింది. అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. అంటే అతి తక్కువ మెజారిటీతో ఈ బిల్లు గట్టెక్కింది. అమెరికాలో దాదాపు 44.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారిలో చాలామంది భారత్‌‌లోని తమ కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, బంధువులకు పంపుతుంటారు. ఈ పన్ను తగ్గడం వల్ల వారికి కొంత మేలు జరుగుతుంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.
వలసదారులపై ట్రంప్ కఠిన ఆంక్షలు
ఇక, గతేడాది అమెరికా ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ విదేశీయులు, వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కఠిన ఆంక్షలతో వలసదారులను ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత సంక్లిష్టంగా మారాయి. అక్రమ వలసదారులను గుర్తించి.. వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. విద్యార్థులను కూడా ట్రంప్ ప్రభుత్వం వదలిపెట్టడం లేదు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల వీసాలను రద్దుచేసి..అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు.

దీంతో చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అమెరికా కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసింది. స్టాండర్డ్ డిడక్షన్, పిల్లల పన్ను క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచారు. ఇంతకుముందు అమెరికాలో ఉంటున్న వాళ్లు తమ దేశాలకు డబ్బు పంపితే ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు పన్ను విధిస్తోంది. దీని ద్వారా అమెరికా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తాన్ని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు ఉపయోగించాలని ట్రంప్ భావిస్తున్నారు.

Read Also: Miss World: మిస్ వరల్డ్ పోటీలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన.. వీడియో లీక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu cuts taxes Google News in Telugu Latest News in Telugu on remittances Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.