📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Big Boss: ట్రంప్ ‘బిగ్ బాస్’?

Author Icon By Vanipushpa
Updated: May 17, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా పౌరసత్వం కోసం రియాల్టీ షో షాక్!
రెండోసారి అమెరికా అధ్యక్షుడి(America President)గా బాధ్యతలు చేపట్టాక వలసదారులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇప్పుడు వారి ముందు మరో షాకింగ్ ఆఫర్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా అమెరికా పౌరసత్వం(Citizenship) కోరుకుంటున్న వలసదారులకు అందుకోసం ఓ సంచలన షరతు పెడుతున్నారు. అదే రియాల్టీ షో(Reality Show). ఈ షోలో పాల్గొని గెలిస్తే వలసదారులకు వారు కోరుకుంటున్న అమెరికా పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తోంది. అమెరికాలో ట్రంప్ సర్కార్ వలసదారుల్ని వెతికి వెతికి మరీ వారి స్వదేశాలకు పంపేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం కోసం భారీగా డిమాండ్ ఉంది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని నిర్ణయించిన ట్రంప్.. ఇప్పుడు రియాల్టీ షోను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రియాల్టీ షోలో గెలిస్తే ఇక అమెరికన్ పౌరసత్వం ఖాయం అనేలా ఈ షోను డిజైన్ చేస్తున్నారు. ఇందులో గెలిచిన వారికి కచ్చితంగా అమెరికా పౌరసత్వం లభించనుంది.

Big Boss: ట్రంప్ ‘బిగ్ బాస్’?

తీవ్ర కసరత్తు చేస్తున్న హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ
అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ సర్కార్ నిర్వహించే రియాల్టీ షో విధివిధానాలను ఖరారు చేసేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీవ్ర కసరత్తు చేస్తోంది. తమ ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇందులో చాలా అంశాలు ఉంటాయని అధికారులు హింట్స్ ఇస్తున్నారు. ఇందుకోసం ‘ది అమెరికన్’ అనే థీమ్ ను రియాలిటీ టీవీల సీనియర్ యాంకర్, డక్ డైనాస్టీ , ది మిలియనీర్ మ్యాచ్ మేకర్ వంటి షోలకు ప్రసిద్ధి చెందిన రాబ్ వోర్సాఫ్ ప్రతిపాదించారు. స్వయంగా కెనడియన్ వలసదారుడైన వోర్సాఫ్ ఆలోచన ప్రకారం దీన్ని నిర్వహించేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతోంది.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన
అమెరికా పౌరుడిగా నిరూపించుకునే విధంగా ఈ రియాల్టీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు దేశవ్యాప్తంగా తిరిగి టాస్క్ లు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బంగారు గనుల నుంచి బంగారం తీసుకురావడం వంటివి కూడా ఉంటాయని తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని గని నుండి బంగారాన్ని సేకరించడం లేదా ఏ వలసదారుడు ముందుగా రాకెట్‌ను సమీకరించగలరో చూడటం వంటి కార్యకలాపాలు ఈ రియాల్టీషోలో ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Read Also: Miss World: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీల్లో పాల్గొన్న సుందరీమణులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Readlity Show Telugu News online Telugu News Paper Telugu News Today trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.