📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Trump: ఎలాన్​ మస్క్​కు ట్రంప్ వీడ్కోలు

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్​) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్​(Elon Musk)కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)​ వీడ్కోలు పలికారు. అంతేకాకుండా ఆయన సేవలకు గుర్తుగా మస్క్​కు బంగారు రంగులో ఉన్న తాళం చెవిని బహుమతిగా ఇచ్చారు ట్రంప్​. మే 30వ తేదీన ఎలాన్​ మస్క్​ పదవి చివరి రోజు కావడం వల్ల అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయంలో వీడ్కోలు పలికారు.

Trump: ఎలాన్​ మస్క్​కు ట్రంప్ వీడ్కోలు

ట్రంప్​కు స్నేహితుడిగా వుంటాను
ఇక నుంచి అధ్యక్ష కార్యాలయానికి తరచుగా సందర్శిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. ట్రంప్​కు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని అన్నారు. డోజ్​కు పదవీ కాలం పరిమితితో కూడకున్నదని పేర్కొన్నారు. డోజ్​కు ముగింపు కాదని అసలు ప్రాజెక్టు ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ఇప్పటి నుంచి తన వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెడతానని ఈ సందర్భంగా ఎలాన్​ మాస్క్​ వెల్లడించారు.
ఎలాన్​ మస్క్ సేవలను అభినందించిన ట్రంప్
ఎలాన్​ మస్క్​కు వీడ్కోలు పలికిన సందర్భంగా ఆయన సేవలను ట్రంప్​ సేవలను అభినందించారు. డోజ్​ అధిపతిగా ఎలాన్​ మస్క్ అద్భుతమైన పనులు చేశారని ప్రశంసించారు. డోజ్ ద్వారా వృధా ఖర్చులను తగ్గించే అవకాశం కల్పించినందుకు మస్క్​కు కృతజ్ఞతలు తెలిపారు. తరతరాలుగా అత్యంత విస్తృతమైన, పర్యవసానమైన ప్రభుత్వ సంస్కరణలను నడిపించడంలో ఎలాన్ మస్క్ అవిశ్రాంతంగా కృషి చేశారని ట్రంప్ మాట్లాడారు.
మే 30వ తేదీతో గడువు పూర్తి
గురువారం మస్క్​ ప్రత్యేక ‘ప్రభుత్వ ఉద్యోగి పదవి’ నుంచి వైదొలుగుతున్న నిర్ణయాన్ని ఎక్స్​ వేదికగా ప్రకటించారు. ఇటీవల తీసుకొచ్చిన ‘వన్​ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ కు నిరసనగానే మస్క్​పై మీడియాలో కథనాలున్నాయి. కృతిమ మేధ సంస్థ ఓపెన్ఏఐకి, యూఏఈకి మధ్య ఒప్పందం అంగీకరించలేదని మస్క్ అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినట్లు ఓ జర్నల్​లో కథనం పేర్కొంది. దీనిపై మస్క్​ అభ్యర్థనను ట్రంప్ పట్టించుకోలేదని, ఆ విషయం కూడా మస్క్​ రాజీనామాకు కారణమై ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి కూడా వరుసగా 130 రోజులకు మించి హోదాను ఇవ్వకూడదు. దాని ప్రకారం మే 30వ తేదీతో గడువు పూర్తయింది.

Read Also: Parent Fight : అమెరికా స్కూల్‌లో తన్నుకున్న తల్లిదండ్రులు..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Growing opposition to Elon Musk Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump bids farewell

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.