📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Donald Trump: భారత్, పాక్ ఉద్రిక్తతలపై మళ్లీ స్పందించిన ట్రంప్

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బుధవారం తెల్లవారుఝామున ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది. ఆపరేషన్ విషయంలో భారత్ ఎంతో పకడ్బందీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టింది.పాకిస్థాన్‌కు, ఉగ్రమూకలకు భారత్ బలమైన సందేశాలను పంపించింది. పహల్గామ్‌లో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు వారి భార్యల నుదుటన ఉన్న సిందూరాన్ని తుడిచేశారు. దానికి ప్రతీకారమే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో చెప్పకనే చెప్పారు.ఈ ఘటనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగాలని ఆయన పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‘ఇది భయంకరమైన విషయం. నా వైఖరి స్పష్టంగా చెబుతాను ఇరు దేశాలూ నాకు బాగా తెలుసు. ఇద్దరితోనూ మంచి సంబంధాలున్నాయి. వారు పరిష్కార మార్గాన్ని వెతికేలా చూడాలి. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఇది ఆగిపోతే మంచిది’ అని అన్నారు.

విషయం

అయితే ఇరు దేశాలతో ఉన్న బంధాన్ని గుర్తు చేసిన ట్రంప్ వారి మధ్య శాంతి నెలకొల్పడంలో తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. “ఈ ఘర్షణ ఆగాలని కోరుకుంటున్నాను అవసరమైతే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ‘ఇది త్వరగా ముగియాలని ఆశిస్తున్నాను. ఇది మంచిది కాదు మేము ఒవల్ ఆఫీస్‌లోకి అడుగుపెడుతున్నపుడే ఈ విషయం తెలిసింది. కొంతమంది ఇలాంటి దాడి జరిగే అవకాశముందని ఊహించారు. వీరు శతాబ్దాలుగా ఒకరిపై ఒకరు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అయినా ఇది ముగిసిపోవాలి’ అని అన్నారు.అంటే,తాను మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు మరోసారి ట్రంప్ పరోక్షంగా చెప్పారు. గతంలోనూ కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రకటించారు. కానీ, భారత్ మాత్రం దీనిని తిరస్కరించింది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని, ఇతరులు ఇందులో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, అంతకు ముందు భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ స్పందిస్తూ ఇదిలా చాలా విచారకరమని వ్యాఖ్యానించారు. ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

వీసా

గత రెండు వారాలుగా భారత్ పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగిస్తూ ఆ దేశ పౌరుల వీసాలు రద్దు చేసింది. అంతేకాక, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం స్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.దీంతో జమ్మూ కశ్మీర్‌లోని శాంతిని ఉగ్రవాదం మళ్లీ దెబ్బతీసింది.

Read Also :UK: పాక్‌పై యుద్ధం చేసే హక్కు భారత్‌కు ఉంది: యూకే ఎంపీ

#DonaldTrump #IndiaStrikesBack #PahalgamAttack #PakistanTerror #PeaceAppeal #POK #SurgicalStrike #USOnIndoPak Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.