నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలలోకి ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశంలోని పలు చారిత్రక కట్టడాలను, మ్యూజియంలను ఎలాంటి రుసుము చెల్లించకుండానే సందర్శించే అవకాశం ప్రజలకు లభించింది.దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, చరిత్ర గొప్పదనాన్ని వారికి తెలియజేయడమే ఈ ఉచిత ప్రవేశం కల్పించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఏఎస్‌ఐ(ASI) అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా అత్యంత విలువైన, అరుదైన పురావస్తు కళాఖండాలు కొలువుదీరిన 52 మ్యూజియంలలోకి ఉచితంగా వెళ్లే అవకాశాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా తమ సంస్థ పరిధిలో ఉన్న సుమారు 3,698 చారిత్రక ప్రదేశాల్లో కూడా ఈ ఉచిత ప్రవేశ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.
ఉచితం
ఈ సందర్భంగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్‌మహల్, ఎర్రకోటతో పాటు తెలంగాణలోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోటలను కూడా ప్రజలు ఉచితంగా సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, ఇటీవల వారణాసిలో ప్రారంభమైన మాన్‌మహల్ అబ్జర్వేటరీలోని వర్చువల్ ఎక్స్‌పీరియన్షియల్ మ్యూజియం వంటి అనేక ఇతర ప్రదేశాలను కూడా ఎలాంటి రుసుము లేకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దేశ ఘనమైన చరిత్రను, వారసత్వ సంపదను తెలుసుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇప్పుడు వేసవి సెలవులు వచ్చేశాయి. పట్టణాల్లో ఉన్న వారు పల్లె బాట పడితే గ్రామాల్లో ఉన్న వారు హైదరాబాద్‌లోని బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక పిల్లల ఎంజాయ్‌మెంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సెలవుల్లో పిల్లలను పట్టుకోవడం తల్లిదండ్రుల వల్ల కాదు. వారి అల్లరితో టాప్ లేచిపోతుంది. మరి ఈ సెలవుల్లో పిల్లలను ఎంటర్‌టైన్ చేయాలంటే నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. అక్కడకు వెళ్తే వారికి సరదాగా ఉండటమే కాక నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మరి ఈ సెలవుల్లో మీరు కూడా అలాంటి ప్లేస్‌కి వెళ్లాలని భావిస్తున్నారా అయితే మీకు బెస్ట్ ఆప్షన్ నగరంలోని సాలర్‌జంగ్ మ్యూజియం. పైగా ఇప్పుడు ఫ్రీ ఎంట్రీ.
దీనిలో భాగంగా సాలార్‌జంగ్ మ్యూజియంలోనే వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16-21వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటుందని,ఫ్రీ ఎంట్రీ ఆఫర్ ఉంది కనుక కుటుంబ సమేతంగా తరలివచ్చి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలను వీక్షించాలని కోరారు.
మ్యూజియంలో లైటింగ్, వాతావరణం, సందర్శకులను ఆకట్టుకుంటుందని మ్యూజియం డైరెక్టర్(Museum Director) తెలిపారు. భారత స్వాతంత్య్రాన్ని సూచించే విధంగా 75 వస్తువులతో ప్రదర్శన ఉంటుందని అలానే హైదరాబాద్‌కే ప్రత్యేకంగా నిలిచే బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్, ఉపన్యాసం ఉంటుందని ఆయన వివరించారు. కనుక నగర ప్రజలు ఈ ఆఫర్‌ని వినియోగించుకోవాలని సూచించారు.
Read Also : IRCTC: ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీలు..మే 22 నుంచే ప్రారంభం