📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Vishnu Irigi Reddy: అమెరికాలో తెలుగు ఇంజినీర్ సహా ముగ్గురు పర్వతారోహకులు మృతి

Author Icon By Vanipushpa
Updated: May 15, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లోని వాషింగ్టన్(Washigton) రాష్ట్రంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో భారత సంతతికి చెందిన ప్రముఖ ఇంజినీర్ సహా ముగ్గురు పర్వతారోహకు(Trekking) లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి (Vishnu Irigi Reddy) మృతి చెందారు. సియాటెల్‌లో నివసిస్తున్న 48 ఏళ్ల విష్ణు, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నార్త్ క్యాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పియర్స్ ప్రాంతానికి పర్వతారోహణకు వెళ్లారు. పర్వతాన్ని అధిరోహించి, కిందకు దిగుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో ప్రమాదం సంభవించింది. వారు ఉపయోగించిన యాంకర్ పాయింట్ అదుపు తప్పి, సుమారు 200 అడుగుల లోయలో పడిపోయారు.

Vishnu Irigi Reddy: అమెరికాలో తెలుగు ఇంజినీర్ సహా ముగ్గురు పర్వతారోహకులు మృతి

అధికారులకు ప్రమాదం గురించి సమాచారం
ఈ దుర్ఘటనలో విష్ణు ఇరిగిరెడ్డితో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, బృందంలోని నాలుగో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, ఆ యువకుడు సుమారు 64 కిలోమీటర్ల ప్రయాణించి, సురక్షిత ప్రాంతానికి చేరుకుని అధికారులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. ఆయన అందించిన వివరాలతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ బృందాలు హెలికాప్టర్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీశారు.
విష్ణు ఇరిగిరెడ్డి, సియాటెల్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన తన రంగంలో నిష్ణాతుడిగా పేరుపొందడమే కాకుండా, గ్రేటర్ సియాటెల్ ప్రాంతంలో జరిగే పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విష్ణు మరణవార్త ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కుటుంబాల్లో విషాదం:
విష్ణు మరణవార్త తన కుటుంబం, స్నేహితులు, సియాటెల్ తెలుగు సమాజంలో తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనేవారిగా పేరు పొందిన ఆయన, స్థానిక తెలుగు సంఘాల్లో ఎంతో ఆదరణ పొందారు.

Read Also: Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu die in America Google News in Telugu including a Telugu engineer Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Three mountaineers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.