📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఇజ్రాయేల్ లో వరుసగా మూడు బస్సు పేలుళ్లు

Author Icon By Vanipushpa
Updated: February 21, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయేల్ లో వరుసగా మూడు బస్సు పేలుళ్లు.వరుస బస్సు పేలుళ్లతో ఇజ్రాయేల్ ఉలిక్కిపడింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం బాట్‌యామ్‌ సిటీలో మూడు బస్సుల్లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. హమాస్‌తో కాల్పులు విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి పేలుడు ఘటన జరగడం గమనార్హం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బాట్‌యామ్ నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాంబు స్క్యాడ్‌తో సహా ఎమర్జెన్సీ దళాలు అక్కడకు చేరుకుని.. విస్తృత తనిఖీలు చేపట్టాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బాట్‌యామ్‌ మేయర్ టజ్వికా బ్రోట్ ధ్రువీకరించారు.

ఇజ్రాయేల్ లో వరుసగా మూడు బస్సు పేలుళ్లు

పాలస్తీనా ఉగ్ర సంస్థల పాత్రపై అనుమానాలు
మరోవైపు, పేలుళ్ల వెనుక పాలస్తీనా ఉగ్ర సంస్థలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇజ్రాయేల్‌ రక్షణశాఖ మంత్రి కాట్జ్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లో గుర్తించిన పేలుడు పదార్థాలు… తాజా ఘటనలో పరికరాలు ఒకేలా ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఉగ్రదాడి అనడానికి పలు ఆధారాలు లభ్యమవుతున్నాయని వివరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశానికి పిలుపునిచ్చినట్లు తెలిపింది.
ఇజ్రాయెలీల మృతదేహాలను అప్పగించిన హమాస్‌
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీల్లో చనిపోయిన నలుగురు ఇజ్రాయెలీల మృతదేహాలను హమాస్‌ అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, అందులో ఒ మృతదేహం తమ దేశానికి చెందిన మహిళది కాదని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.

ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం గజా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తొలిసారి కావడం గమనార్హం. ఈ పేలుళ్లతో దేశవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

ఇజ్రాయెల్‌ భద్రతా చర్యలు కట్టుదిట్టం
పేలుళ్ల అనంతరం ఇజ్రాయెల్ భద్రతా దళాలు హైఅలర్ట్‌ ప్రకటించాయి. బాట్‌యామ్ నగరంతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా కవాతు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పెంచడంతో పాటు బస్సు టెర్మినల్‌లు, రైల్వేస్టేషన్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు కఠినతరం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అంతర్జాతీయంగా హోమ్లెవల్ స్పందన
ఈ పేలుళ్ల నేపథ్యంలో పలుదేశాలు స్పందించాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించాయి. ఇటువంటి ఘటనలు మానవతావాద విలువలను దెబ్బతీస్తాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరాయి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu israel Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Three consecutive bus blasts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.