📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Hermit Crabs: అక్రమంగా హెర్మిట్ జాతి పీతల రవాణా..ముగ్గురు అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెర్మిట్ జాతి పీత (Hermit Crabs)లను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను జపాన్‌ (Japan) లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితులను దక్షిణాన ఉన్న అమామి (Amami) అనే ద్వీపంలో అదుపులోకి తీసుకున్నారని, వారంతా చైనా (China)కు చెందిన వారని జపాన్ మీడియా (Japan Media)లో కథనాలు వచ్చాయి. ఈ ద్వీపంలో (స్పైరల్-షెల్డ్) శంకం వంటి శరీర ఆకారంగల పీతలు అరుదైనవి కావడంతో వీటిని సంరక్షణ జాబితాలో చేర్చారు.
సూట్‌ కేసుల నుంచి వచ్చిన శబ్దం
సూట్‌ కేసుల నుంచి ఏదో శబ్దం వస్తోందని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని హోటల్ సిబ్బంది వారికి చెప్పారు. అప్పుడే వారు పీతలను అక్రమ రవాణా చేస్తున్నట్లు అర్ధమై సిబ్బంది అప్రమత్తమయ్యారని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. తరువాత అధికారులు దాదాపు 95 కిలోల బరువున్న కొన్ని వేల హెర్మిట్ జాతి పీత(Hermit Crabs)లు ఆ సూట్‌కేసులలో ఉన్నట్టు కనుగొన్నారు. మూడో వ్యక్తి దగ్గరున్న మూడు సూట్‌కేసుల సెట్‌లో మరో 65 కిలోల పీతలు ఉన్నట్లు గుర్తించారు.

Hermit Crabs: అక్రమంగా హెర్మిట్ జాతి పీతల రవాణా..ముగ్గురు అరెస్ట్

కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
వాటిని అమ్మడానికా, పెంపుడు జంతువులుగా మార్చుకోవడానికా లేక తినడానికి రవాణా చేస్తున్నారా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ‘మేం అన్నికోణాల్లో సమీక్షిస్తున్నాం’ అని బుధవారం నిందితుల అరెస్ట్ తర్వాత పోలీసు ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. అమామి ద్వీపంలోని వృక్ష, జంతు వైవిధ్యంలో భాగమైన హెర్మిట్ పీతలు “జాతీయ సంపద” అని పోలీసులు తెలిపారు. ఈ పీతలు తమ మనుగడకోసం గవ్వలను వెతికి వాటిలో నివసిస్తాయి. అందుకే వాటికి హెర్మిట్ పీతలన్న పేరొచ్చింది. ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యటక బీచ్‌లలో ఇవి కనిపిస్తాయి. ఈ పీతల విలువ సుమారు 20 వేల యెన్( సుమారు రూ. 12 వేలు)లు ఉండొచ్చని జపాన్ టైమ్స్ పేర్కొంది.

Read Also: Qatar: ఖతార్‌ రాజ కుటుంబం ట్రంప్‌కి లగ్జరీ విమానం గిఫ్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hermit crabs illegally transporting Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Three arrested

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.