📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్

Author Icon By Vanipushpa
Updated: February 24, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపారు. దీంతో ఈ మ్యాచ్ గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన అద్భుత ప్రదర్శనతో అందరి మనస్సులు గెలిచాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ ఆడుతూ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. సెంచరీ చేసిన అనంతరం విరాట్ కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు.
దేవుడు నాతో ఉన్నాడు
“ఈ రోజు రాత్రి దేవుడు నాతో ఉన్నాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను ఎప్పుడయితే లో గా ఫీలవుతానో అప్పుడు నాకు నేను ఇలా చెప్పుకుంటా.. ప్రతి బంతికి కూడా నువ్వు వంద శాతం న్యాయం చేయాలి. అలానే చేశా” అంటూ విరాట్ కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్‌తో కలిసి రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా మెయింటేన్ చేశాడు. గిల్ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మిడిల్ ఓవర్లలో రాణించాడు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను అడ్డుకుని నిలబడ్డాడు.


‘నేను చెప్పానుగా.. ‘
ముప్పై ఓవర్లు దాటిన తర్వాత విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ కాస్తంత దూకుడు పెంచుతూ విజయానికి దగ్గరగా వెళ్లారు. అదే సమయంలో విరాట్ కోహ్లి కూడా సెంచరీకి దగ్గరగా వెళ్లి బౌండరీతో శతకం పూర్తి చేయడమే కాకుండా మ్యాచ్‌ని కూడా గెలిపించాడు. భారత్ గెలవగానే విరాట్ కోహ్లి కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూస్తూ ‘నేను చెప్పానుగా.. నేను ఉంటాను’ అని చేతులతో సైగలు చేశాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లోకి వచ్చి విరాట్ కోహ్లిని ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. సెంచరీ చేయడంతో అభినందించాడు. ఆ తర్వాత ఏదో ఫన్నీగా మాట్లాడుకున్నారు. బహుశా హార్దిక్ పాండ్యా హిట్టింగ్ గురించే అనుకుంటా. అంతకుముందు కోహ్లి క్రీజులో ఉన్నప్పుడు గాల్లో సిక్సర్ బాదేసి సెంచరీ చెయ్ అంటూ రోహిత్ శర్మ చెప్పడం ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది.

టాప్ పొజిషన్‌లో..
దాయాదుల సమరం అంటే ఇండియా, పాకిస్థాన్ దేశాల క్రికెట్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ టీవీలకు అతుక్కుపోతారు. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ ఫ్యాన్స్ అమితాసక్తి కనబర్చారు. 5 మిలియన్లకుపైగా సెర్చ్‌తో గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్లో నిలిచింది. మన దేశంలో జమ్మూ కశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, ఒడిశా, డామన్ డయ్యన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఈ మ్యాచ్ గురించి గూగుల్‌లో తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబర్చారు.

https://vaartha.com/wp-content/uploads/2025/02/విరాట్-ఎమోషనల్.mp4

'This is all God's plan' #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu india Latest News in Telugu Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Virat is emotional

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.