📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Train Cable: దక్షిణ స్పెయిన్‌లో కేబుళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆగిన రైళ్లు

Author Icon By Vanipushpa
Updated: May 6, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైళ్లు నడవడంలో ఉపయోగపడే రాగి తీగల (కాపర్ కేబుల్స్) దొంగతనం కారణంగా స్పెయిన్‌లో పెద్ద ఎత్తున రైళ్లు ఆగిపోయాయి. రాజధాని మాడ్రిడ్ నుంచి దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా మధ్య హైస్పీడ్ ట్రైన్లు ఆగిపోవడంతో, వేలమంది ప్రయాణికులు రాత్రిపూట రైళ్లలోనే చిక్కుకుపోయారు. ఆదివారంనాడు ఈ దొంగతనం జరిగింది. రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే దీనిని ‘తీవ్ర విధ్వంసక చర్య’ అని అభివర్ణించారు. హైస్పీడ్ లైన్‌లో ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు ప్రదేశాలలో కేబుల్ దొంగతనం జరిగిందని ఆయన తెలిపారు.

సోమవారం ఉదయం నుంచి రైలు కార్యకలాపాలు పునరుద్ధరిస్తున్నామని పుయెంటే చెప్పారు. మాడ్రిడ్, సెవిల్లె, మలగా, వాలెన్సియా, గ్రెనడా మధ్య రైళ్లు నిలిచిపోయిన కారణంగా, పర్యాటకులు మరియు లోకల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సెవిల్లె ఫెరియా ఉత్సవానికి వచ్చిన వారికి పెద్ద సమస్య తలెత్తింది.

Train Cable: దక్షిణ స్పెయిన్‌లో కేబుళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆగిన రైళ్లు

స్పెయిన్, పోర్చుగల్‌లలో నిలిచిపోయి విద్యుత్ సరఫరా
స్పెయిన్, పోర్చుగల్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఇబ్బందులకు గురైన వారం తర్వాత ఈ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రైళ్లు నిలిచిపోయాయి. గతవారం కరెంటు పోవడానికి కారణమేంటో ఇంకా తేలలేదు. గత వారమే స్పెయిన్, పోర్చుగల్‌లలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి తర్వాత మళ్లీ వచ్చింది. “గత రెండు వారాలుగా ఇలాంటి హఠాత్పరిణామాలు ఎందుకు సంభవిస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది?” అని రాయిటర్స్ వార్తా సంస్థతో అమెరికాకు చెందిన పర్యటకుడు కెవిన్ అన్నారు. మాడ్రిడ్‌లోని అటోచా స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ స్టేషన్‌లో వేలమంది చిక్కుకుపోయారు.
ఇబ్బంది పడ్డ 10వేల మందికి పైగా ప్రయాణికులు
మాడ్రిడ్, సెవిల్లె, మలగా, వాలెన్సియా, గ్రెనడా మధ్య కనీసం 30 రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడగా, 10వేల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సెవిల్లెలో వారంరోజుల పాటు జరిగే ఫెరియా ఉత్సవం కోసం నగరానికి పర్యటకులు భారీగా తరలివచ్చారు. ఇంతలో ఇలా జరిగింది. ‘‘ ప్రయాణికులు, సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు హై స్పీడ్ రైళ్ల కార్యకలాపాలు పునరుద్ధరించాం” అని రవాణా మంత్రి సోమవారం ఉదయం చెప్పారు. దొంగతనం జరిగిన ప్రదేశాలను అటవీ మార్గం ద్వారా చేరుకోవచ్చని ఆయన అన్నారు. రైలు సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని స్పెయిన్ జాతీయ రైల్వే మేనేజర్ ఆదిఫ్ సోమవారం మధ్యాహ్నం తెలిపారు.

ఏం జరిగిందో తెలుసుకోడానికి, బాధ్యులను గుర్తించడానికి ఆదిఫ్ సహా ఇతర అధికారులతో సివిల్ గార్డ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని స్పెయిన్ హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. గత కొన్నేళ్లుగా రాగి ధర బాగా పెరిగింది. దీంతో రైలు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల నుంచి కాపర్ కేబుల్ దొంగతనాలు పెరిగాయి. గత కొన్నేళ్లుగా రాగి ధరలు గణనీయంగా పెరగడంతో, రైలు, టెలికాం నెట్‌వర్క్‌లలో ఉండే కేబుళ్ల దొంగతనాలు అధికమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా ఆస్తుల రక్షణపై కొత్త సవాళ్లకు దారితీస్తోంది.

Read Also: Pak, Bangladesh: పాక్, బంగ్లా సరిహద్దుల్లో భారత్ మరింత కట్టుదిట్టం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu halt trains Latest News in Telugu Paper Telugu News southern Spain Telugu News online Telugu News Paper Telugu News Today Thieves steal cables

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.