📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

pope: పోప్ రేసులో ఉన్న కార్డినల్స్ వీరే!

Author Icon By Anusha
Updated: April 22, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్యాథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో సోమవారం రోజు ఉదయం పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోప్ ఫ్రాన్సిస్ మృతి తర్వాత నుంచి కొత్త పోప్ ఎవరు అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలీ ఎన్నిక ఎలా సాగుతుంది, ఈసారి పోప్‌గా ఎన్నికయ్యేందుకు ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో క్యాథలిక్ లు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ చాలా కాలంగా కార్డినల్స్ నుంచే పోక్‌ను ఎన్నుకుంటూ వస్తున్నారు. అత్యంత రహస్యంగా సాగే ఈ ఎన్నికలో ఈ ఐదుగురు కార్డినల్స్ పోటీ చేయబోతున్నారని వీరిలోంచే ఒకరు పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

కార్డినల్ పీట్రో పరోలిన్

కార్డినల్ పీట్రో పరోలిన్ ఇటలీ దేశస్థుడు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న, అందరూ ఇష్టపడే వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు కల్గిన ఈయన గతంలో పోప్ సెక్రటరీగా పని చేశారు. దీంతో ఆయనకు వాటికన్‌తో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా పీట్రో పరోలిన్ సున్నితమైన చర్చల్లో పాల్గొన్నారు.

కార్డినల్ పీటర్ టర్క్‌సన్..

కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ఘనా దేశానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం 76 ఏళ్ల వయసు కల్గిన ఈయనకు పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశం ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. ఆఫ్రికాలో క్యాథలిక్ ల సంఖ్య పెరుగుతుడండంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తినే పోప్‌గా నియమించాలన్న డిమాండ్లు వస్తుండగా పీటర్ టర్క్‌సన్‌కు ఈ అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. కార్డినల్ పీటర్ టర్క్‌సన్‌కు హోమోసెక్స్, సామాజిక న్యాయం, ఎకాలజీ వంటి అంశాలపై లిబరల్ అభిప్రాయాలు ఉన్నాయి.

కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే

కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే ఫిలిప్పీన్ దేశస్థుడు. ప్రస్తుతం ఈయన వయసు 67 ఏళ్లు కాగా మీడియాలో ఈయనకు మంచి పేరుంది. అనేక మంది జర్నలిస్టులతో సత్సంబంధాలు సాగిస్తున్నారు. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. ఈక్రమంలోనే అంతా ఈయన పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. ఈయనే కనుక తదుపరి పోప్ అయితే ఆసియా నుంచి ఎన్నికైన తొలి పోప్‌గా చరిత్రకెక్కుతారు. సామాజిక న్యాయం విషయంలో పోప్ ఫ్రాన్సిస్ మాదిరిగానే ఈయనకు అభిప్రాయులున్నాయి.

కార్డినల్ పీటర్ ఎర్డో

కార్డినల్ పీటర్ ఎర్డో హంగేరికి చెందిన వ్యక్తి. కమ్యూనిస్టుల పాలన సమయంలో పుట్టిన ఈయనకు ప్రస్తుతం 72 ఏళ్లు కాగా చర్చి ప్రచారం కోసం తీవ్రంగా కష్ట పడ్డారు. యురోపియన్ బిషన్స్ కాన్ఫరెన్స్ మండలి చీఫ్‌గా కూడా ఆయన పని చేశారు. ఈక్రమంలోనే ఈయనకు పోప్అయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మంది మద్దతు తెలిపే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈయన పోప్‌గా ఎన్నికతే ఫ్రాన్సిస్ లిబరల్ విధానాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు.

కార్డినల్ మైకోలా బైచోక్

కార్డినల్ మైకోలా బైచోక్ చిన్న వయసు కల్గిన కార్డినల్. ప్రస్తుతం 45 ఏళ్లు మాత్రమే ఉన్న ఈయన గతేడాదే కార్డినల్‌గా మారారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికాలో చర్చి సర్వీసెస్‌లో పాల్గొన్న ఈయన రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తరఫున వాదనలు వినిపించారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించిన కార్డినల్స్‌లో ఈయన కూడా ఒకరు. అన్ని విషయాల్లో ఇతడికి అందరి మద్దతు లభించినా వయసు తక్కువగా ఉంది కాబట్టి పోప్ అయ్యే అవకాశం కాస్త తక్కువనే చెప్పొచ్చు. చూడాలి మరి అంతా భావిస్తున్నట్లు ఈ ఐదుగురి లోనుంచే కొత్త పోప్ వస్తాడా లేక మరెవరైనా ఈ ఎన్నికల్లో గెలిచి షాకిస్తారా అనేది చూడాలి.

Read Also: Bandi Sanjay: ఉద్యోగాల పేరిట మయన్మార్‌కు తరలింపు..బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరిక

#CatholicChurch #NewPope #PapalElection #PopeFrancis #PopeFrancisDeath Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.