📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: తులసి గబ్బార్డ్‌ చెప్పిన మాటల్లో నిజం లేదు: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్, ఇజ్రాయేల్(Iran, Israel) మధ్య దాడులతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటనలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలతో మరో వివాదం తలెత్తింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్(tulsi gabbard) అంచనాలను ఆయన తోసిపుచ్చారు. ‘ఇరాన్ అణు బాంబుల తయారీ విషయంలో ఆమె అభిప్రాయం తప్పు,’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ‘కాబట్టి నా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తప్పు చెప్పినట్టే అవుతుంది.. ఆమె చెప్పిన మాటల్లో నిజం లేదు’ అని మీడియాతో అన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల ఎదట మార్చి నెలలో తులసి గబ్బార్డ్(tulsi gabbard) మాట్లాడుతూ.. ‘ఇరాన్ ఇప్పటికీ అణ్వాయుధాలు తయారీపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు విశ్వసిస్తున్నాయి’ అని చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం దీనిని ఖండించారు.
అణు శక్తిని కేవలం పౌరవినియోగం కోసమేనని ఇరాన్ చెబుతున్న విషయాన్ని కూడా ట్రంప్ వ్యతిరేకించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వల కలిగిన ఇరాన్‌కు న్యూక్లియర్ ఎనర్జీ‌తో పనేంటి?.. చమురును మించి అణు శక్తి ఎందుకు కావాలి?’ అని ట్రంప్ ప్రశ్నించారు. కాగా,ఇరాన్ అణుస్థావరాలు, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయేల్ దాడులు కొనసాగుతున్నాయి.

Trump: తులసి గబ్బార్డ్‌ చెప్పిన మాటల్లో నిజం లేదు: ట్రంప్

నాటో ఖర్చులపై విమర్శలు
నాటో సభ్యదేశాల రక్షణ వ్యయం జీడీపీలో 5 శాతంగా నిర్ణయించాలన్న ప్రతిపాదనపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు, కానీ మిగతా దేశాలు నెరవేర్చాలి’ అని అన్నారు. స్పెయిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంపై ట్రంప్ మండిపడ్డారు. ‘వారు మంచి చర్చాకారులు కావచ్చు, లేదా సరిగా ప్రవర్తించలేదు… స్పెయిన్ కూడా మిగతావారిలాగే ఖర్చు చేయాలి’ అని వ్యాఖ్యానించారు. త్వరలోనే నాటో సభ్యదేశాల సమావేశం జరగనున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ యంత్రాంగంలో అంతర్గత విభేదాల సంకేతమా?
అధికార వర్గాల ప్రకారం.. ట్రంప్.. తులసీ గబ్బార్డ్‌ను వ్యక్తిగతంగా వ్యతిరేకించడం లేదు, కానీ ఆమె పనితీరుపై విమర్శలు చేస్తూ పదవి నుంచి తప్పించనున్న అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను బట్టి ట్రంప్ యంత్రాంగంలో విదేశాంగ, రరక్షణ విధానాలపై అంతర్గత విభేదాలు ఉన్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. అంతేకాకుండా, ఇరాన్‌పై అమెరికా వైఖరి మరింత కఠిన దిశగా వెళ్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గబ్బార్డ్ కౌంటర్: “ఇతరులు వక్రీకరిస్తున్నారు”
మరోవైపు, అమెరికా నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తనపై వచ్చిన విమర్శలకు శుక్రవారం స్పందించారు. ‘మీడియా నా మాటలను వక్రీకరించి ప్రజల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు ‘అసత్య ప్రచారం చేస్తున్న మీడియా నా వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా వివరించాయి. ఇది చిత్తశుద్ధిలేని ప్రచారం. అమెరికా ఇంటెలిజెన్స్‌కు తెలిసిన సమాచారం ప్రకారం.. ఇరాన్ అణు బాంబు తయారీకి చివరి దశలో ఉంది. వారు నిర్ణయం తీసుకుంటే, కొన్ని వారాల్లోనో నెలల్లోనో పూర్తిగా అసెంబుల్ చేయగలరు’ అని గబ్బార్డ్ స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు
ట్రంప్, తులసి గబ్బార్డ్ మధ్య ఇరాన్ అణు బాంబు అంచనాలపై విభేదాలు
గబ్బార్డ్ వ్యాఖ్యలపై మీడియా వక్రీకరణకు నిరసన, ట్రంప్: “ఇరాన్‌కు అణుశక్తి అవసరం లేదు”
నాటో సభ్యదేశాల ఖర్చులపై ట్రంప్ అసహనం, ట్రంప్ యంత్రాంగంలో విదేశాంగ విభాగంలో తీవ్ర అంతర్గత ఒత్తిళ్లు, అంతేకాదు, అంతేకాదు,అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లే, ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదు.. నేను ఈ విషయంపై ఆయనతో ఏకీభవిస్తున్నాను” అని ఆమె అన్నారు.

Read Also: Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగం పూలపాన్పు కాదు..ఓ భారతీయుడి ఆవేదన

#IranNuclearProgram #MiddleEastTensions #telugu News #TrumpVsTulsi #USIntelligence Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today TrumpAdministration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.