📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Powerful Army: భారత్ ఆయుధశక్తిని చూసి విస్మయం చెందుతున్న ప్రపంచం

Author Icon By Vanipushpa
Updated: May 14, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)తో పాకిస్థాన్ (Pakistan) కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత్ షాక్ ఇచ్చింది. భారత్ ఆయుధాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కైతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా (Make In India, Made In India) కార్యక్రమాలతో రక్షణ (Defence)రంగంలో భారత్ సూపర్ స్ట్రాంగ్ (Super Stronge)గా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 21వేల కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిని భారత్ దిగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరింత అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని భారత్ ప్రణాళిక వేస్తోంది.

Powerful Army: భారత్ ఆయుధాశక్తిని చూసి విస్మయం చెందుతున్న ప్రపంచం

భారత్ సత్తా చాటుతోంది
అయితే కేవలం దిగుమతులే కాకుండా ఎగుమతుల్లోనూ భారత్ సత్తా చాటుతోంది. దాదాపు 100 దేశాలకు మన ఆయుధ సామాగ్రిని ఎగుమతి చేసింది భారత్. భారత్ ఎగుమతుల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా లాంటి దేశాలు ఉండటం భారత్.. డిఫెన్స్ పరంగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. రక్షణ సామాగ్రి ఎగుమతి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ గా భారత ఆర్మీ దూసుకెళ్తోంది. అమెరికా, రష్యా లాంటి దేశాలను భారత్ దాటేసింది.

ఉగ్రవాదం, సైబర్ ఎటాక్స్ ఇతర విపత్తుల కారణంగా..

తాజాగా స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సిప్రీ) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగానికి వ్యయం పెరిగింది. ఉగ్రవాదం, సైబర్ ఎటాక్స్ ఇతర విపత్తుల కారణంగా అనేక దేశాలు ఇప్పుడు తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. భారత్ కూడా తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచినట్లు సిప్రీ తన నివేదికలో పేర్కొంది. ఇక 2025 లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏదో చెప్పేసింది సిప్రీ. ఈ లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు అమెరికా పవర్ ఇండెక్స్ 0.0744 తో టాప్ ప్లేస్ లోఉంది. ఆర్మీ సంఖ్య 20 లక్షల 35 వేలుగా ఉంది. ఇక రెండో స్థానంలో రష్యా ఉంది. రష్యా పవన్ ఇండెక్స్ 0.0788గా ఉంది. రష్యా ఆర్మీ సంఖ్య 35లక్షల 67 వేలుగా ఉంది.
మూడో స్థానంలో చైనా
ఇక చైనా మూడో స్థానంలో ఉంది. చైనా పవర్ ఇండెక్స్ 0.0788 గా ఉంది. చైనాలో సైన్యం సంఖ్య 31 లక్షల 70 వేలుగా ఉంది.ఇక నాలుగో స్థానంలో భారత్ ఉంది. భారత్ సైన్యం 51 లక్షల 37 వేల 550 మంది. ఇక ఐదో స్థానంలో దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా పవర్ ఇండెక్స్ 0.1656 గా ఉంది. ఆర్మీ సంఖ్య 38 లక్షల 20 వేలుగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. పాకిస్థాన్ టాప్ 10 స్థానాల్లో లేదు. పాక్ 12 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ పవర్ ఇండెక్స్ 0.2513గా ఉంది.

Read Also: Cannes Film Festival : దుస్తులపై కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కొత్త రూల్స్ ..ఎందుకంటే ?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India's military might. is in awe o Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The world

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.