📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

America: అప్పుల ఊబిలో అగ్రరాజ్యం విలవిల..డాలర్‌కు పొంచి వున్న ముప్పు!

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాపై అప్పుల భారం ఏటా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఇది అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. కేవలం వడ్డే చెల్లింపులకే ఏటా ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతోంది. ఇదే విధంగా అప్పులు పెరుగుతూ పోతే అమెరికా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడి, ఆ దేశ ఆర్థిక వృద్ధి నిలిచిపోవచ్చని చెబుతున్నారు. జూన్ 20 నాటి అమెరికా ప్రభుత్వంపై ఉన్న అప్పు దేశ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలో పెరిగే మొత్తం కంటే ఎక్కువ. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం.. పెద్ద సంస్కరణలు లేకుండా 2055 నాటికి అప్పు జీడీపీ(GDP)లో 156 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుత స్థాయిలో పెరుగుతున్న ఖర్చులు , స్థిరమైన వృద్ధి కారణంగా ఏటా 2 ట్రిలియన్ డాలర్ల (2 Triliani Dollors)లోటు అప్పుల పెరుగుదలకు దారితీస్తోంది.

America: అప్పుల ఊబిలో అగ్రరాజ్యం విలవిల..డాలర్‌కు పొంచి వున్న ముప్పు!

అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా సంక్షోభం ప్రభావం
అమెరికా(America)కు అతిపెద్ద, తాజా ముప్పు వడ్డీ చెల్లింపుల రూపంలో ఉంది. మొత్తం ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు నాలుగింట ఒక వంతు ఇప్పుడు అప్పులు తీర్చడానికే ఖర్చవుతోంది. దీని అర్థం సామాజిక భద్రత, మెడికేర్, జాతీయ రక్షణ, మౌలిక సదుపాయాల కోసం చాలా తక్కువ డబ్బు మిగులుతుంది. ఈ రంగాలు లక్షలాది మంది అమెరికన్లకు చాలా కీలకంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా సంక్షోభం ప్రభావం ముప్పు కేవలం బడ్జెట్(Budget) కోతలకు మాత్రమే పరిమితం కాదు. ఈ అప్పు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించగలదని, రుణ్ ఖర్చులను పెంచగలదని, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించగలదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అప్పుల భారం నియంత్రించబడకపోతే రాబోయే దశాబ్ధంలో జీడీపీ 340 బిలియన్ల నష్టం సంభవించవచ్చని సీబీవో అంచనా వేస్తోంది. ఇది 1.2 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోవడానికి, అన్ని రంగాలలో వేతన పెరుగుదల మందగించడానికి దారితీయవచ్చు. డాలర్ విలువ పడిపోవచ్చు.. వడ్డీ రేట్ల పెరుగుదల నష్టాన్ని మరింత పెంచుతోంది
నిరుద్యోగం పెరుగుతోంది
అయినా పెరుగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పుల సంక్షోభం పెరుగుతున్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పెరుగుతోంది. కానీ దాని వేగం చాలా మందగించింది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనా కేవలం 1.4 నుంచి 1.6 శాతంగా ఉంది. నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఆర్థికవేత్తలు, వ్యాపార విశ్లేషకుల హెచ్చరికలు, ఎలన్ మస్క్ వంటి వారి వ్యాఖ్యలు ఇప్పుడు నిజమని అనిపిస్తున్నాయి. అమెరికా ఇదే మార్గంలో వెళ్తే.. రాబోయే తరాలు మాత్రమే కాదు.. చాలా ముందుగానే దీని పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు.

Read Also: Pakistan : మా సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని

#telugu News a threat to the dollar! Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu is reeling under Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The superpower under a debt trap

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.