📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్

Author Icon By Sudha
Updated: May 7, 2025 • 2:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, “సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్

దాడులు కొనసాగించాలి
మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈ తరహా స్పందన రావడం గమనార్హం.
దాడి దృశ్యాల విడుదల
ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు. కోట్లీలోని గుల్పూర్ ఉగ్రవాద శిబిరంపై భారత సైన్యం ఎలా దాడి చేసిందో వివరిస్తూ కల్నల్ సోఫియా ఖురేషి ఒక వీడియోను ప్రదర్శించారు. గతంలో ఫూంచ్‌ సెక్టార్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. భారత మాజీ ఆర్మీ చీఫ్‌లు, రిటైర్డ్ జనరల్స్, మిలటరీ నిపుణుల ప్రకటనలు చూస్తే, భారత్ ఉగ్రవాదం మీద యుద్ధాన్ని కొనసాగించే సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులు ఒక మిషన్ ముగింపు కాదు – ప్రారంభం మాత్రమే అని వారి అభిప్రాయాలు సూచిస్తున్నాయి. “భారత్ ఇక్కడితో ఆగకూడదు… ఇది యుద్ధం కాదు, అప్రకటిత యుద్ధం ఇప్పటికే సాగుతోంది” అని స్పష్టం చేశారు.

భారత్ తమ రక్షణ హక్కును నిర్భయంగా వినియోగించాలన్నారు.

Read Also: Trump : అమెరికా ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులకు కొత్త ఆఫర్ – $1000 ప్రోత్సాహకం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Former Indian Army Chief Google News in Telugu is not over yet Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.