📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza: ఇజ్రాయెల్‌ దాడిలో పిల్లలను కోల్పోయిన ఓ వైద్యుడి దీన గాథ..

Author Icon By Vanipushpa
Updated: May 26, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హమాస్‌ పేరుతో ఇజ్రాయెల్‌ (Israel) రక్తపుటేరులు పారిస్తున్నది. గాజాపై (Gaza) భీకర దాడులకు పాల్పడుతూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. గాజాపై ఇ‍జ్రాయెల్‌ జరిపిన సైనికదాడిలో తన పది మంది సంతానంలో తొమ్మిది మందిని కోల్పోయిన ఓ వైద్యుడు (Gaza Doctor) ప్రస్తుతం దవాఖానాలోని ఇంటెన్సివ్ కేర్ (ICU) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య ఉన్నాడు. శుక్రవారం ఇజ్రాయెల్‌ సైన్యం ఖాన్‌ యూనిస్‌పై (Khan Younis) వైమానిక దాడి జరిపింది. గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ (Hamdi Al-Najjar) అనే డాక్టర్‌ తన 10 మంది పిల్లలతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో.. వారిలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. డాక్టర్‌ నజ్జర్‌తోపాటు ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు.

Gaza: ఇజ్రాయెల్‌ దాడిలో పిల్లలను కోల్పోయిన ఓ వైద్యుడి దీన గాథ..

ఐసీయూలో చికిత్స
అయితే నజ్జర్‌ తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన కడుపు, ఛాతీలో రక్త స్రావం అవుతున్నదని, దానిని నియంత్రించేందుకు రెండు సార్లు ఆపరేషన్లు జరిగాయని అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా అనే డాక్టర్‌ వెల్లడించారు. అతని తలకు కూడా తీవ్రగాయం అయిందని, ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.
నజ్జర్ భార్య వైద్యురాలు
కాగా, నజ్జర్ భార్య ఆలా (Doctor Alaa) కూడా వైద్యురాలు. అయితే దాడి సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో బతికిపోయారు. గత 20 నెలలుగా హమాస్‌, ఇజ్రాయెల్‌ పోరులో గాయపడిన పాలస్తీనియన్లకు తన భర్తతోపాటు ఆమె వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారని నజ్జర్‌ సోదరి తహని యాహ్యా తెలిపారు. కాగా, వారి పది మంది సంతానంలో ఓ బాలుడు మాత్రమే బతికారని, అతనికి కూడా తీవ్ర గాయాలైనప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మృతిచెందినవారంతా ఒకటి నుంచి 12 ఏండ్ల వయస్సు లోపువారేనని పేర్కొన్నారు.
53 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి
అయితే శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుంచి పౌరులను తరలించినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో యుద్ధం మొదలయ్యింది. ఇప్పటివరకు ఈ పోరులో 53 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. వారిలో 16,500 మందికిపైగా చిన్నారులే ఉన్నారు.
ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రతిజ్ఞ
హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడమే కాక, వారి వద్ద బందీలుగా ఉన్న 53 మంది తమ దేశ పౌరులను విడిపించేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రతిజ్ఞ బూనింది. అంతేకాక, గత రెండున్నర నెలల నుంచి గాజాకు ఆహారం, మందులు, చమురు సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడి పౌరులు ఆకలితో అల్లాడుతున్నారు. ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు మానవతా సాయాన్ని పాక్షికంగా ఇజ్రాయెల్‌ పునరుద్ధరించింది.

Read Also: Trump: స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను తగ్గించిన ట్రంప్

#telugu News a doctor who lost his children Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in an Israeli attack. Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The harrowing story Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.