📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Black Box: దొరికిన కీలకమైన బ్లాక్ బాక్స్

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్ బయల్దేరిన బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే నివాస సముదాయాలపై కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ లోపం అని కొందరు.. విమానంలో తలెత్తిన టెక్నికల్ సమస్య అని మరికొందరు, మానవ తప్పిదమని ఇంకొందరు.. ఇలా రకరకాల కారణాలు అంచనా వేస్తున్నారు. ఈ విమాన ప్రమాదాన్ని నిపుణులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. అయితే విమానంలో అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్ నిన్నటి నుంచి దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేయగా.. తాజాగా అది దొరికింది. సంఘటనా స్థలంలోనే బ్లాక్ బాక్స్(Black Box) దొరికినట్లు పోలీసులు వెల్లడించారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Black Box: దొరికిన కీలకమైన బ్లాక్ బాక్స్

బ్లాక్ బాక్స్ కీలకం

ఇక ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. దొరికిన ఈ బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఆ బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అయిన సమాచారం ఆధారంగా అసలు విమానం ఎందుకు కూలిపోయింది అనే విషయాలు తెలియనున్నాయి. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది కనుక్కోవడంలో విమానంలోని బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. విమానం టేకాఫ్ కావడంలో తలెత్తిన ఇబ్బంది, టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ కాల్ ఇవ్వడం, విమానంలో అంతకుముందే టెక్నికల్ సమస్య ఉన్నట్లు ఓ ప్రయాణికుడు వీడియో పోస్ట్ చేయడంతో అసలు ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా లేక ఇంజిన్ పనిచేయకపోవడమా లేదా మానవ తప్పిదమా, ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలుసుకోవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఇచ్చే సమాచారమే కీలకం కానుంది.
విమానంలో జరిగే ప్రతీ విషయం ఈ బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అవుతుంది. అందుకే అలాంటి బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించి అది ఇచ్చే సమాచారం ఆధారంగానే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతీ కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి.

ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్.. ఇంకొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్

ఇక ఆ బ్లాక్ బాక్స్‌లో 2 కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్.. ఇంకొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది.. విమానానికి సంబంధించిన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, ఇంధనం, ల్యాండింగ్ గేర్ పనితీరు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి స్టోర్ చేస్తుంది. విమాన ఎలా ప్రయాణిస్తుంది అనేది అనుక్షణం కనిపెడుతూ రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అనేది.. కాక్‌పిట్‌లో పైలట్లు, ఎయిర్‌లైన్ సిబ్బంది మధ్య జరిగే సంభాషణలు, పైలట్ల అనౌన్స్‌మెంట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌‌తో జరిపే కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది.

విమానం వెనుక భాగంలో బ్లాక్ బాక్సు

మరోవైపు.. విమాన ప్రమాదానికి ముందు పైలట్లు ఎలాంటి సహాయం కోసం అడిగారు.. వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు మొత్తం ఈ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఈ రికార్డర్లు 25 గంటల పాటు విమానానికి సంబంధించిన పూర్తి డేటాను స్టోర్ చేస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈ బ్లాక్ బాక్సు విమానం వెనుక భాగంలో ఉంటుంది. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది. ఏదైనా విమాన ప్రమాదం జరిగినపుడు.. దాని ముందు భాగం బాగా దెబ్బతింటుంది.. కానీ వెనుక భాగం మాత్రం తక్కువగానే ధ్వంసం అవుతుంది. ఈ కారణం వల్లే బ్లాక్ బాక్స్‌ను వెనుక భాగంలో అమర్చడం వల్ల భారీ ప్రమాదం జరిగినా దానికి ఏం కాకుండా చూస్తారు.

Read Also: Vijay Rupani : విజయ్‌ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని

#telugu News Ap News in Telugu box found Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The crucial Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.