📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన వివరాలను స్కెచ్‌లు, రేఖాచిత్రాలు, ఆడియో నోట్స్ రూపంలో పాక్ ఏజెంట్‌(Pak agent)కు పంపించి, ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.థానే సమీపంలోని కల్వా ప్రాంతానికి చెందిన రవీంద్ర వర్మ ఓ ప్రైవేటు డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతడికి దక్షిణ ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లోకి ప్రవేశం ఉండేదని, తరచూ యుద్ధనౌకలు, జలాంతర్గాములపైకి కూడా వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐవో) వలపు వలలో చిక్కాడు.

ఏజెంట్‌

రవీంద్ర వర్మ ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు రహస్య సమాచారాన్ని పంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ సమాచారానికి బదులుగా అతడు భారత్, విదేశాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు అందుకున్నాడు” అని ఒక అధికారి తెలిపారు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల గురించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్టు మరో అధికారి తెలిపారు.నేవల్ డాక్‌యార్డ్‌(Naval Dockyard) సందర్శనల సమయంలో మొబైల్ ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడంతో వర్మ తన పని ముగించుకుని బయటకు వచ్చాక యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని స్కెచ్‌లు, రేఖాచిత్రాల రూపంలో పంపేవాడని, కొన్నిసార్లు ఆడియో నోట్స్ ద్వారా కూడా సమాచారం ఇచ్చేవాడని అధికారులు పేర్కొన్నారు. జలాంతర్గాములు, యుద్ధనౌకల పేర్లను కూడా పాక్ ఏజెంట్‌తో పంచుకున్నాడని ఏటీఎస్ అనుమానిస్తోంది.

Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

అధికారి

2024 నవంబర్ నుంచి వర్మ పాకిస్థాన్ ఏజెంట్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. 2024లో ‘పాయల్ శర్మ’, ‘ఇస్ప్రీత్’ అనే ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు రాగా, వాటిని అంగీకరించాడు. ఈ రెండు ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులు మహిళలుగా నటిస్తూ, తాము భారతదేశానికి చెందినవారమని, యుద్ధనౌకల సమాచారం అవసరమైన ఓ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని నమ్మబలికారు. కొద్దిరోజుల సంభాషణల తర్వాత, వారు వర్మను హనీట్రాప్‌లో దింపి, కీలకమైన సంస్థాపనల గురించి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడం ప్రారంభించారని, వర్మ ఆ సమాచారాన్నంతా పాక్ ఏజెంట్లకు చేరవేసేవాడని అధికారులు వివరించారు.తాను ఏమి చేస్తున్నాడో, ఎవరికి సున్నితమైన సమాచారం అందిస్తున్నాడో అతనికి పూర్తిగా తెలుసు. సమాచారం అందించినందుకు ప్రతిఫలంగా డబ్బు కూడా పొందుతున్నాడు” అని ఓ అధికారి స్పష్టం చేశారు. నిందితుడైన రవీంద్ర వర్మను అరెస్ట్ చేసిన ఏటీఎస్(ATS) అధికారులు, కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి సోమవారం వరకు ఏటీఎస్ కస్టడీ విధించింది.  

Read Also: UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

#ATSArrest #Espionage #HoneyTrap #IndiaSecurity #NationalSecurity #PakSpyNetwork Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.