Texas Helicopter Crash: అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాలడో (Salado) పట్టణం సమీపంలో బుధవారం ఒక సైనిక హెలికాప్టర్ అనుకోని రీతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ధాటికి ఆ ప్రాంతంలో భారీ ఎత్తున కార్చిచ్చు (Wildfire) చెలరేగి, వందలాది ఎకరాల గడ్డి భూమి పూర్తిగా దగ్ధమైంది.

50 శాతం అదుపులోకి వచ్చిన మంటలు
ప్రమాల తీవ్రతను గుర్తించిన స్థానిక అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ప్రమాద ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని నివారించారు. టెక్సాస్ అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి, గురువారం సాయంత్రానికల్లా కార్చిచ్చును దాదాపు 50 శాతం మేర అదుపులోకి తెచ్చింది. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది.
Texas Helicopter Crash: దర్యాప్తునకు ఆదేశం
అధునాతన ప్రమాణాలతో కూడిన ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ (AH-64 Apache Attack Helicopter) అకస్మాత్తుగా కూలిపోవడానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై ప్రస్తుతం ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలా అనే కోణంలో రక్షణ శాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :