📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Terror Attack: విదేశీ అతిథులు ఉన్నప్పుడే భారత్‌పై ఉగ్రదాడులు

Author Icon By Anusha
Updated: April 23, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అగ్ర నేత భారత్‌ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత్‌లో పర్యటించినప్పుడు కూడా అనంత్‌నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది.అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

పర్యటన

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌ పర్యటనలో ఉండడాన్ని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్‌- పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్ భారత్‌ పర్యటనకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో, అంటే 2000 మార్చి 20న అనంత్‌నాగ్ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేసి 36 మందిని బలి తీసుకున్నారు. నాడు సిక్కులే ముష్కర మూకలకు లక్ష్యంగా మారారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఉద్దేశంతోనే పాక్ కుట్ర చేసింది.నాడు ఉగ్రవాదులు రెండు సైనిక వాహనాల్లో, భారీ స్థాయిలో తుపాకులు తీసుకుని ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి చొరబడ్డారు. భారత సైనికుల వేషంలో ఇంటింటికీ వెళ్లి, తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని బెదిరించారు. అలా వచ్చిన పురుషులను గురుద్వారా వద్దకు తీసుకెళ్లి చంపేశారు. భారత సైన్యమే అలా చేసిందని, అక్కడి వారిని నమ్మించేలా ఉగ్రవాదులు నినాదాలు చేశారు. చివరికి దర్యాప్తులో పాక్ ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఉగ్రదాడి వెనుక

ఇప్పటి పహల్గాం ఉగ్రదాడికి, 2000లో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, తన కుటుంబంతో సహా భారత పర్యటనకు వచ్చారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దీనితో జమ్మూకశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేయాలని పాక్ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. అందుకే భారత సైనికుల్లా వేషాలు వేసుకున్న ఉగ్రవాదులు, కశ్మీర్‌లోని పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. మరీ ముఖ్యంగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారు.పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్ మునీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసీమ్ మునీర్ ఇటీవలే ఓవర్సీస్‌ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ, భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. మరోవైపు ఇదే సమయంలో పాక్‌ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్‌, రావల్పిండి బేస్‌లకు తరలించారు. ఇదంతా భారత్‌తో ఢీకొట్టడానికి పాక్ చేస్తున్న ప్రయత్నమా? అనే అనుమానాలను బలపరుస్తోంది.

ఆసీమ్‌ మునీర్‌, పాక్ ఆర్మీ చీఫ్‌

మన లక్ష్యం స్పష్టంగా ఉంది. గతంలో కశ్మీర్‌ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. ఇక భవిష్యత్తులోనూ అలానే ఉంటుంది. కశ్మీర్‌ను మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరులు పోరాటం చేస్తున్నారు. వారిని మనం ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్‌ కథను కచ్చితంగా చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశం హిందువుల కంటే చాలా భిన్నమని మన పూర్వీకులు భావించారు. ఆ విషయాన్నే పిల్లలకు చెప్పండి. అప్పుడే మన పూర్వీకుల ఆలోచనలను పిల్లలు గుర్తుంచుకుంటారు. ఈ రెండు మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు పూర్తిగా భిన్నమైనవి. అదే ఈ రెండు దేశాల సిద్ధాంతానికి పునాది.”

Read Also: Pahalgam Attack: అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాం‌..నేడు భయానక వాతావరణం

#NationalSecurity #PahalgamAttack #PakistanConspiracy #TerrorAlert #TerrorStrike Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.