📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Vivek Agnihotri: కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతం కాదు?: వివేక్ అగ్నిహోత్రి

Author Icon By Vanipushpa
Updated: May 13, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాశ్మీర్‌(Kashmir)లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్థాన్‌(Pakistan)ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ (Pakistan) ఒక నర్సరీగా పనిచేస్తోందన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెలిపారు. అయితే, ఉగ్రవాదులకు కొంతమంది మన పౌరులే సహకరిస్తున్నారని, దీంతో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం కొనసాగడానికి ఇదే మూలకారణమని ఆయన నొక్కి చెప్పారు.

Vivek Agnihotri: కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతం కాదు: వివేక్ అగ్నిహోత్రి

స్థానికులు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు
ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడంతో పాటు వారికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్రయం కల్పిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. దాడుల అనంతరం ఉగ్రవాదులను జనంలో కలిసిపోయేలా చేసి, కొంతకాలం ఆశ్రయమిచ్చి ఆపై వారిని తప్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఉగ్రవాద సానుభూతిపరులను గుర్తించి కంట్రోల్ చేయాలని చెప్పారు. అప్పటి వరకు కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతం కాదని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ పోలీస్ చీఫ్ కేపీఎస్ గిల్ క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు
1980లలో పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసిన తీరును వివేక్ అగ్నిహోత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ కేపీఎస్ గిల్ క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు తీసుకుని, హింసకు పాల్పడిన వారిని గుర్తించి ఏరివేయడం వల్లే అక్కడ ఉగ్రవాదం అంతమైందని ఆయన పేర్కొన్నారు. “పంజాబ్‌లో కేపీఎస్ గిల్ నేరుగా ఇంటికి వెళ్లి హంతకులను పట్టుకున్నప్పుడే అక్కడ ఉగ్రవాదం సమూలంగా నిర్మూలించబడింది. అలాంటి చర్యలు చేపట్టనంత వరకు ఇక్కడ సమస్య పరిష్కారం కాదు,” అని వివేక్ అగ్నిహోత్రి స్పష్టం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించాలంటే అంతర్గత సహకారాన్ని అడ్డుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: Oparation sindoor : మా సైనికులు 11 మంది మృతి: పాక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Operation Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Terrorism Vivek Agnihotri will not end in Kashmir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.