Israel: గాజాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు శాంతి చర్చలకు తీవ్రంగా కృషి చేస్తుండగా, ఇజ్రాయెల్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపింది. గాజా నగరంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ప్రత్యేక సైనిక ఆపరేషన్‌కు ఆమోదం తెలుపుతూ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ(Israeli Defense Ministry) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్‌కు ‘గిడియన్స్ చారియట్స్ II’ అనే పేరు పెట్టగా, దాని ప్రధాన ఉద్దేశ్యం గాజా నగరాన్ని చుట్టుముట్టడం, హమాస్ ఆధిపత్యాన్ని నిర్వీర్యం చేయడం, బందీలను విడిపించడం, తద్వారా నగరంపై పూర్తి భద్రతా ఆధిపత్యాన్ని ఏర్పరచడం. ఈ వ్యూహాత్మక దాడికి అవసరమైనంత మంది బలగాలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దశలో సుమారు 60,000 రిజర్వ్ సైనికులు రంగంలోకి దించబోతున్నారు.
కాల్పులక విరమణ ఉప్పందంపై స్పందించిన నెతన్యాహు
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బుధవారం ఈ ప్రణాళికకు అధికారికంగా మంజూరు ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం గాజా నగరాన్ని త్వరితగతిన అదుపులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఆదేశించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దుల్లో మోహరించి, కొన్ని ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పినట్టు సమాచారం. భూతల దాడికి రంగం సిద్ధమవుతోందని తాజా ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఈ చర్యలపై హమాస్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలను నెతన్యాహు విస్మరించారని హమాస్ ఆరోపించింది. తాము అంగీకరించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించకపోవడం దారుణమని పేర్కొంది. బందీల విషయంలో ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న వ్యవహార శైలి ఆందోళన కలిగించేదిగా ఉందని విమర్శించింది.
ఇదిలా ఉండగా, గాజా ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మానవతా విపత్తు తీవ్రత దారుణంగా పెరిగిందని, ప్రజలు తీవ్ర ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారని సంబంధిత నివేదికలు వెల్లడిస్తున్నాయి. గాజాలోని 81 శాతం కుటుంబాలు తీవ్ర ఆహార కొరతతో బాధపడుతున్నాయని, పోషకాహార లోపం బాలల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్షణ కాల్పుల విరమణ అవసరం అనే పిలుపు అంతర్జాతీయంగా వెల్లువెత్తుతోంది.
ఇజ్రాయెల్ తాజా ఆపరేషన్ ఏమిటి?
ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా ‘గిడియన్స్ చారియట్స్ II’ పేరుతో ఒక భారీ సైనిక ఆపరేషన్‌కు ఆమోదం తెలిపింది. దీని ముఖ్య ఉద్దేశ్యం గాజా నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టడం, హమాస్ ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయడం, బందీలను విడిపించడం, భద్రతా ఆధిపత్యాన్ని స్థాపించడం.
ఇజ్రాయెల్ ఈ దాడికి ఎందుకు సిద్ధమవుతోంది?
హమాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగ్రచర్యలను అంతమొందించేందుకు, బందీలను విడిపించేందుకు, గాజా నగరంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఈ వ్యూహాత్మక దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE: