Telugu News: Helicopter-కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి

Read Time:  1 min
Telugu News: Helicopter-కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
FONT SIZE
GET APP

Helicopter: పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గిలిట్-బలిస్థాన్లోని డయామర్(Diamer in Gilgit-Baltistan) జిల్లాలో ఎంఐ-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పర్యాటక ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన హెలిప్యాడ్పై టెస్ట్ ల్యాంగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Telugu News: Helicopter-కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి

వరద బాధితులకు సాయం

ఇదిలా ఉండగా ఖైబర్ పంఖువా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province) లో ఇటీవల మరో ప్రభుత్వ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. వరద బాధితులకు సహాయం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే తాజాగా మరో ప్రభుత్వ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వారిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారు.

హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఏమిటి?

కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-benguluru-technician-dies-from-snake-bite-in-sandal-without-touching/national/539427/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.