తెలంగాణ,కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌కు చెందిన యువ వైద్య విద్యార్థి అష్రిత్ వియత్నాం దేశంలోని కాన్ థో నగరంలో దుర్మరణం చెందాడు.MBBS మూడో సంవత్సరం చదువుతున్న అష్రిత్ అనే 21 ఏళ్ల విద్యార్థి బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి చెందాడు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్- ప్రతిమ దంపతుల కుమారుడు అర్షిద్ అష్రిత్ (21). అష్రిత్ వియత్నాం దేశంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే బుధవారం తెల్లవారుజామున స్నేహితుడితో 150 సీసీ బైక్ పై అతివేగంగా వెళ్తూ ఒక ఇంటి గోడను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అష్రిత్(Ashrith) అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
తల్లిదండ్రులను ఓదార్చారు
ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున పెద్దగా రద్దీలేని రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ ఒకటి కనిపించింది. బైక్ నేరుగా గోడను ఢీ కొట్టడం వీడియోలో కనిపించింది. అనంతరం బైక్‌పై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడటం వీడియోలో చూడొచ్చు.తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ పి హరీష్ బాబు(P Harish Babu) ఆశ్రిత్ ఇంటికి చేరుకుని అతడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి వీలు కల్పించాలని కోరారు.
Read Also: Telangana: డస్సాల్ట్ ఏవియేషన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం