📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Florida Teacher: మైనర్ విద్యార్ధితో టీచర్ తరగతి గదిలోనే రాసలీలలు

Author Icon By Vanipushpa
Updated: June 2, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయులకు అందిస్తూ వారి గొప్పతనాన్ని వివరించారు. అచ్చంగా అమ్మా, నాన్నల్లాగే పిల్లల్ని దండిస్తూ.. వారిన సరైన మార్గంలో పెడతారనే ఈ స్థానాన్ని కల్పించగా.. ఓ టీచరమ్మ ఆ విషయాన్ని మర్చిపోయింది. తనకంటే వయసులో 11 ఏళ్ల చిన్నవాడైన మైనర్ అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. అది చాలదన్నట్లుగా తరగతి గదిలోనే అతడితో కలిసి తన కామ కోరికను తీర్చుకుంది. అయితే ఈ విషయం కాస్తా వెలుగులోకి రాగా.. పోలీసులు ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు.

Florida Teacher: మైనర్ విద్యార్ధితో టీచర్ తరగతి గదిలోనే రాసలీలలు

ఇద్దరూ ప్రేమలో పడ్డారు
అమెరికా(America)లోని ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో గల రివర్ వ్యూ హైస్కూల్‌లో 27 ఏళ్ల బ్రూక్ ఆండర్సన్.. సైన్స్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే అదే పాఠశాలలో చదివే 16 ఏళ్ల బాలుడిపై ఈమెకు ప్రేమ మొదలు అయింది. అతడు కూడా ఈమెపై ఆసక్తి కనబర్చగా.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ముఖ్యంగా 2024 సెప్టెంబర్ నెల నుంచి వీరిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఫోన్ల ద్వారానే చాలాకాలం ప్రేమాయణం సాగించిన వీరు ఏకంగా తరగతి గదిలోనే చాటుమాటుగా మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేశారు. రెచ్చిపోయారు.
టీచర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇది మాత్రమే చాలదన్నట్లుగా ఇటీవలే మరింతకు తెగించారు. క్లాస్ రూంనే బెడ్రూంగా మార్చుకుని తమ కోరికలు తీర్చుకున్నారు. అయితే పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి బడిలోని మరికొంత మంది ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కూడా వీరిద్దరినీ గమనించి.. ఇది నిజమేనని తెలుసుకున్నారు. ఆపై యాజమాన్యానికి చెప్పగా.. సదరు టీరమ్మను సస్పెండ్ చేస్తూనే.. ఆపై పోలీసులకు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మే 16వ తేదీన మైనర్ బాలుడితో టీచరమ్మ బ్రూక్ ఆండర్సన్ లైంగిక కార్యకలాపాలు జరిపిందని గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు. దీంతో ధర్మాసనం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.

15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
మరోవైపు బ్రూక్ ఆండర్సన్ బెయిల్ కోసం మంజూరు చేసుకోగా.. 60 వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అలాగే పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడు సహా ఈమె ఫోన్‌లను పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా చేసుకున్న చాటింగ్‌ను చూస్తున్నారు. ఒకవేళ ఈమె తప్పు చేసినట్లు తేలితే.. 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటనపై స్థానికులు, విద్యా రంగం, మరియు తల్లిదండ్రులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుడిగా నైతిక విలువలతో ప్రవర్తించాల్సిన వ్యక్తి ఇలా మైనర్ విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించడాన్ని క్షమించలేనిది అంటున్నారు.

Read Also: Haryana: హర్యానాలో రహస్య లేఖ కలకలం..రంగంలోకి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in classroom Latest News in Telugu Paper Telugu News Teacher flirts Telugu News online Telugu News Paper Telugu News Today with minor student

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.