📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

Author Icon By Vanipushpa
Updated: April 11, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి దాడుల నిందితుడు తహవ్వుర్‌రాణాను అమెరికా భారత్‌కు అప్పగించింది. ముంబయి దాడులకు బాధ్యుడైన తహవ్వుర్ రాణాను అమెరికా గురువారం అప్పగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. అప్పగింత ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు రాణా.. అమెరికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఎన్ఐఏ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాణాకు చట్టపరంగా ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో ఆయన అప్పగింత సాధ్యపడిందని తెలిపింది. తహవ్వూర్ రాణా 2013లో ఆయన స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబై దాడులకు పాల్పడినందుకు, డెన్మార్క్‌లో దాడికి ప్రణాళిక వేసినందుకు అమెరికాలో ఆయన దోషిగా తేలారు. ఈ కేసుల్లో, తహవ్వూర్ హుస్సేన్ రాణాకు అమెరికా కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

రోజు ముంబయిలో ఏం జరిగింది?
భారీగా ఆయుధాలు ధరించి శిక్షణ పొందిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయిలోని అనేక ప్రదేశాలు, ప్రసిద్ధ భవనాలపై దాడులు చేశారు. ఈ దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. 160 మందికి పైగా మరణించారు. ముంబయి నగరం 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి, అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. దాడి చేసిన వ్యక్తులు ముంబయిలోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్ళు, ఒక ఆసుపత్రి, రైల్వే స్టేషన్లు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
మొదట్లో ఇంత పెద్ద దాడి జరిగుతుందని ఎవరూ ఊహించలేదు. 60మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో బీభత్సం
రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్‌లో బీభత్సం జరిగింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కూడా ఒకటి . ఆ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దుండగులు ఒక్కసారిగా విచక్షణారహితంగా తూటాలు పేల్చారు.
READ ALSO: Stock Market: 90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Tahavur Rana finally arrived Telugu News online Telugu News Paper Telugu News Today what happened that day?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.