📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Iran: ఇజ్రాయెల్ భీకర దాడులు- బంకర్‌లోకి సుప్రీం లీడర్‌ ఖమేనీ

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌, ఇరాన్‌(Israel, Iran) మధ్య పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌(Israelపై 100 క్షిపణులతో ఇరాన్​ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 60 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులకు గాయాలు కాగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇరాన్​పై చేస్తున్న దాడుల్లో కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

Iran: బంకర్‌లోకి సుప్రీం లీడర్‌ ఖమేనీ హతం!

సురక్షిత ప్రాంతానికి అలీ ఖమేనీ తరలింపు
ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహ్రాన్‌లోని అండర్‌గ్రౌండ్‌ బంకర్‌లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానికి దాడులు జరిపింది. ఆదివారం కూడా ఈ ప్రాంతంలోనే మరోసారి పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఖమేనీని వెంటనే లావిజాన్‌లోని బంకర్‌కు ఆయనను తరలించినట్లు సదరు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. కాగా, గతేడాది ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేనీ కుటుంబం బంకర్‌లోకి వెళ్లిన సందర్భాలున్నాయి.
14 మంది ఇరానియన్‌ అణు శాస్త్రవేత్తలు మృతి
ఇదిలా ఉండగా, సోమవారం తెల్లవారుజామున ఫోర్దో న్యూక్లియర్‌ సైట్‌ వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో స్వల్ప భూకంపం సంభవించినట్లు సమాచారం. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 2.5గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 14 మంది ఇరానియన్‌ అణు శాస్త్రవేత్తలు మరణించారు. గత నాలుగు రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్‌కు భారీగానే నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ అధిపతి మరణించగా, తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ మహమ్మద్‌ కజేమీ, ఆయన డిప్యూటీ జనరల్‌ హసన్‌ మహాకిక్‌ కూడా మృతిచెందారు. ఈ విషయాన్ని నెతన్యాహు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Read Also: America:ఫేక్‌ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులపై అమెరికా ఫోకస్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Fierce Israeli attacks Google News in Telugu Khamenei enters bunker Latest News in Telugu Paper Telugu News Supreme Leader Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.