📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 5:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ ఆటగాడు, మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించి టీమిండియా చేసిన సెలెక్షన్‌పై గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు.ఇదేం సెలెక్షన్ అంటూ శుభ్‌మన్ గిల్‌ను మందలించాడు. లోయరార్డర్ బ్యాటింగ్ కోసం కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టామని చెప్పిన గిల్ వ్యాఖ్యలపై గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటుగా స్పందించాడు. అలా చెప్పడానికి బుద్దుండాలని చివాట్లు పెట్టాడు.బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులు చేసింది.

ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై

శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్‌పై వేటు వేసిన టీమిండియా జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది. ఈ ముగ్గురికి బదులు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), ఆకాశ్‌దీప్‌లకు అవకాశం కల్పించింది. టీమ్ సెలెక్షన్‌పై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్పిన్‌కు సహకరించే ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.’కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై బంతి కాస్త టర్న్ అవుతుంది. ఇది తెలిసి కూడా కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెడుతారా? బ్యాటింగ్ డెప్త్ కోసం కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం లేదని చెప్పడం సిగ్గు చేటు.జట్టులోని టాపార్డర్ విఫలమైతే.. వాషింగ్టన్, నితీష్ రెడ్డి 7, 8వ స్థానాల్లో వచ్చి ఏం చేస్తారు? వాళ్లేమి తొలి టెస్ట్‌లో విఫలమైన బ్యాటర్లు కాదు కదా? తొలి మ్యాచ్‌లో మొత్తం 830కి పైగా పరుగులు చేశారు. 

అత్యుత్తమ స్పిన్నర్లుతో

రెండో ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేయలేక ప్రత్యర్థికి అవకాశం కల్పించారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేయడం కాదు. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని సిద్దం చేసుకోండి.’అని గవాస్కర్ చురకలంటించాడు. టీమిండియా తుది జట్టు ఎంపికపై దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లుతో ఆడుతున్నట్లు నాకు అనిపించడం లేదు. టీమిండియా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంతో పాటు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌కు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఆశించిన ఫలితం దక్కుతుంది.’అని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్‌పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం

క్రీజులో శుభ్‌మన్ గిల్‌తో పాటు రవీంద్ర జడేజా

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) అజేయ శతకం చెలరేగగా యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) తో పాటు రవీంద్ర జడేజా(67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(2/59) రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు.

క్రికెట్ విశ్లేషకుల

గవాస్కర్ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఈ తరహా విమర్శలు టీమిండియా యాజమాన్యం, సెలెక్షన్ కమిటీ దృష్టిని కూడా ఆకర్షించాయి. భారత క్రికెట్ జట్టులో యూత్ కెప్టెన్సీకి అవకాశం ఉంది కానీ, అనుభవం, వ్యూహాత్మక ఆలోచనల లోటుతో అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. గిల్ ఆధ్వర్యంలో టీమిండియా (Team India) విజయపథంలో నడవాలంటే, సెలెక్షన్‌లో సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.మొత్తంగా, సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు గిల్‌కు ఒక హెచ్చరికలా మారాయి. యువ కెప్టెన్సీకి ఇది ఒక బుద్ధి పాఠం కావచ్చు. ఆటలో విజయం సాధించాలంటే సమర్థవంతమైన బౌలింగ్, బ్యాటింగ్ మధ్య సమన్వయం అవసరం. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడంలో సీనియర్ల సూచనలు యువ కెప్టెన్లకు ఎంతో ఉపయోగపడతాయి.

Read Hindi: hindi.vaartha.com

Read Also: Diogo Jota: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ప్లేయర్

Anderson-Sachin Trophy Ap News in Telugu Breaking News in Telugu cricket controversy cricket legends opinion Gavaskar angry at Gill Gavaskar on team selection Gavaskar reaction Gavaskar slams Gill Google News in Telugu India England second test India test series news India vs England Test Indian Cricket News Kuldeep Yadav not selected Kuldeep Yadav omission Latest News in Telugu lower order batting decision Paper Telugu News Shubman Gill selection controversy Shubman Gill under fire Sunil Gavaskar criticizes Shubman Gill Team India captain criticism team India selection issue team selection criticism Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.