నగరంలో జరుగుతునన చారిత్రాత్మక మిస్ వరల్డ్ 2025(Miss World) పోటీలకు ప్రముఖ భారతీయ దాతృత్వవేత్త, వ్యాపారవేత్త సుధారెడ్డి(SudhaReddy) ఎంపికయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఒక గుర్తింపు పొందిన మహిళా నాయకురాలిగా,మార్పు కోసం కృషి చేసిన వ్యక్తిగా బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే మిస్ వరల్డ్ యొక్క దాతృత్వ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించడం ఆనందంగా ఉందని తనను గ్లోబల్ అంబాసిడర్‌గా గౌరవించడాన్ని బాధ్యతగా భావిస్తానని అన్నారు.
కమిటీలో సభ్యురాలిగా చేర్చడం గర్వంగా వుంది
గ్రాండ్ ఫినాలేలో అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల కమిటీలో కూడా తనను సభ్యురాలిగా చేర్చడం గర్వంగా ఉందన్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో తాము 1972లో సంస్థను స్థాపించి మహిళలు, పిల్లలు తమ పూర్తి సామర్ధ్యాన్ని సాధించేందుకు ప్రేరణనివ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించినందుకు మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు జూలియో మర్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్లోబల్ వేదిక ద్వారా ప్రభావవంతమైన కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలు, పిల్లలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. మూడున్నర దశాబ్ధాల తర్వాత మిస్ వరల్డ్ పోటీలు భారత దేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
Read Also: Opal Suchata Choeuwong: తెలంగాణ ప్రజలకు మిస్