📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Sudha Murthy: కోట్ల ఆస్తులు వున్నా ఒక్క చీర కూడా కొనని సుధా నారాయణ మూర్తి

Author Icon By Vanipushpa
Updated: March 14, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధనవంతులు, సంపన్నుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ కాస్త ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే ఎంత సంపాదించిన లేదా ఎంత సంపాదన ఉన్నసరే ఇప్పటికి కొందరు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ధనవంతుల మహిళల పేర్లు చూస్తే అందులో సుధా మూర్తి అనే పేరు తప్పక ఉంటుంది.

సామాజిక సేవలకు ఫెమస్

సుధా మూర్తి సింప్లిసిటీకి, సామాజిక సేవలకు ఫెమస్. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఆమె సాధారణంగానే ఉంటుంది. ఆమె వయస్సు 74. సుధా మూర్తి దంపతులు ఇద్దరు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు… అవును, మీరు సుధా మూర్తిని చూసి, ఆమె ఒక ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త భార్యా అని, ఆమె అల్లుడు ఒక దేశ ప్రధానమంత్రి అని ఎవరూ చెప్పలేరు. అంతే కాదు ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా.


ఒక్క నిర్ణయంతో ఒక్క చీర కూడా కొనలేదు

DNA నివేదిక ప్రకారం, కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ సుధా మూర్తి మూడు దశాబ్దాలుగా ఒక్క కొత్త చీర కూడా కొనలేదు. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉండోచ్చు. అయితే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధా మూర్తి వాదిస్తున్నారు. నిజానికి ఆమె కాశీ వెళ్ళినపుడు ఆమె తనకు ఇష్టమైనదాన్ని వదిలి వెళ్లాలని అనుకుంది. ఆమెకు చీరలంటే చాలా ఇష్టం, అప్పటి నుండి ఆమె కొత్త చీరలు కొనలేదని సమాచారం. కాశీకి వెళ్ళినప్పుడు సుధా మూర్తి తనకు ఇష్టమైన వస్తువును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని వినయానికి చిహ్నంగా తీసుకుంది.

అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో నారాయణ మూర్తి
ఎన్.ఆర్. నారాయణ మూర్తి: సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు మరో సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద $5.2 బిలియన్లు. 1981 నుండి 2002 వరకు అంటే 21 ఏళ్ళు ఇన్ఫోసిస్ CEOగా ఉన్నారు. నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకుంది.

సుధా మూర్తికి గౌరవ డాక్టరేట్ ప్రదానం

మైసూర్ విశ్వవిద్యాలయం 105వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో సుధా మూర్తి సేవలకు గుర్తింపుగా ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. జీవితంలో చాలా సింపుల్ లైఫ్ గడపడం కొంతమందిని చూసి ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి ఆమె ఒక మంచి ఉదాహరణ. సుధా మూర్తి 2023లో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించారు. రాజ్యసభలో ఆమె ఉనికి మన ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శనం, సుధా మూర్తి సేవలు ఇంకా ఆమె కృషి మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల బలం అండ్ సామర్థ్యాన్ని వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Xలో షేర్ చేసారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu does not buy a single saree Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Sudha Narayana Murthy Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.