📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Iran: ఇరాన్ సరిహద్దుల గుండా భారత్ కు రానున్న విద్యార్ధులు

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) మధ్య యుద్దం ముదురుతోంది. ఇరాన్(Iran) పై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ప్రతీకార దాడులతో రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. భారత్(India) కు మిత్రదేశాలైన ఇజ్రాయెల్-ఇరాన్ ఇలా యుద్ధంలోకి దిగడంతో కేంద్రానికి సైతం ఏం చేయాలో తెలియని పరిస్ధితి. దీంతో దౌత్య మార్గాల్లో, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల్నీ కోరింది. అదే సమయంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ముఖ్యంగా ఇరాన్ లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులు యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఉండాల్సిందిగా అక్కడి భారత ఎంబసీ పలు విజ్ఞప్తులు చేస్తున్నా పరిస్ధితులు పూర్తిగా విషమిస్తే ఏం చేయాలన్న దానిపై ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారతీయ విద్యార్ధులు సురక్షితంగా భూసరిహద్దులు దాటేలా అనుమతించాలని ఇరాన్ ను కేంద్రం కోరింది. దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది.

ఇరాన్ సరిహద్దుల గుండా భారత్ కు రానున్న విద్యార్ధులు

ఇరాన్ లో 1500 మందికి పైగా మన విద్యార్దులు
ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో భారతీయ విద్యార్ధుల్ని వాయు మార్గంలో స్వదేశానికి తీసుకురావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భూసరిహద్దుల్ని తెరిచి వారిని క్షేమంగా తమ దేశం దాటేలా చూడాలని భారత్ కోరుతోంది. దీనికి ఇరాన్ అంగీకరించడంతో ఇవాళ్టి నుంచి సరిహద్దుల గుండా భారతీయ విద్యార్ధుల్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా బయటికి అనుమతించబోతున్నారు. ఇరాన్ కు భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.
ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు
ప్రస్తుత పరిస్థితి, దేశంలోని విమానాశ్రయాల మూసివేత, అలాగే అనేక రాజకీయ మిషన్లు తమ దౌత్యవేత్తలను, జాతీయులను విదేశాలకు బదిలీ చేయమని భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా, అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఇందుకోసం సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్ నంబర్లు, వాహన వివరాలను జనరల్ ప్రోటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారత్ ను కోరారు.

దౌత్యవేత్తలతో పాటు ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రయాణ సమయం, ఆ వ్యక్తి దేశం నుండి నిష్క్రమించడానికి కావలసిన సరిహద్దు వివరాలు కూడా కోరారు. టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లు, టెలిగ్రామ్ లింక్‌ ద్వారా నిరంతరం విద్యార్థులతో సంప్రదింపులో ఉంది. ఇరాన్‌లోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. తరగతులు నిలిపివేయబడ్డాయి. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉండటంతో, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కష్టంగా మారాయి. అలాగే భారతీయ పౌరుల కోసం రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌ లైన్‌ నెంబర్లను ఇచ్చింది

Read Also: America:ఫేక్‌ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులపై అమెరికా ఫోకస్

#IsraelIranConflict #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Students coming Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.