📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Student Arrest: అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన

Author Icon By Vanipushpa
Updated: March 27, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థులపై ఇమిగ్రేషన్ కఠిన చర్యలు
అమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లని వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మసాచుసెట్స్‌లో చోటుచేసుకున్న తాజా ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విదేశీ విద్యార్థినిని మంగళవారం రాత్రి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మూడు కార్లలో ప్రత్యేక బృందంగా వచ్చిన అధికారులు, ఆమె నివాసమైన ఆఫ్-క్యాంపస్ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని ఈ అరెస్టు చేపట్టారు.

బేడీలు వేసి కారులో తీసుకెళ్లిన పోలీసులు
భుజాన బ్యాగుతో వెళుతున్న విద్యార్థినిని అధికారులు చుట్టుముట్టి, ఆమె చేతులు వెనక్కి విరిచి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే, ఆ విద్యార్థిని వీసా రద్దు అయినట్లు సమాచారం. యూనివర్సిటీ అధికారుల ప్రకటన ప్రకారం, ఈ అరెస్టు విద్యార్థులలో భయాందోళనలకు కారణమైంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ వీడియో
స్టూడెంట్ అరెస్టును సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇప్పటి వరకు హోంల్యాండ్ సెక్యూరిటీ లేదా విద్యార్థిని తరఫున న్యాయవాది ఈ ఘటనపై అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటనపై విద్యార్థులు, వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఈ ఘటనను ఖండిస్తూ నిరసనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Student arrested in America Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.