📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Asim Munir: అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తీవ్ర నిరసన

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ‘ఫీల్డ్ మార్షల్’ జనరల్ ఆసిమ్ మునీర్(Asim Munir) ప్రస్తుతం అమెరికా(America) అధికారిక పర్యటనలో ఉండగా, అక్కడ ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత దేశానికి చెందిన ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ, “ఫెయిల్డ్ మార్షల్” అంటూ నినాదాలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఆదివారం అమెరికా చేరుకున్న ఆసిమ్ మునీర్, వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్‌కు చెందిన పలువురు వ్యక్తులు పెద్ద సంఖ్యలో హోటల్ వెలుపల గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునీర్ హోటల్ భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో, నిరసనకారులు “ఆసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి, సిగ్గులేనివాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఆసిమ్ మునీర్ ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు.

Asim Munir: అమెరికాలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తీవ్ర నిరసన

“ఫీల్డ్ మార్షల్ కాదు ఫెయిల్డ్ మార్షల్”

కొంతకాలం క్రితం ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఆసిమ్ మునీర్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం ‘ఫీల్డ్ మార్షల్‌’గా పదోన్నతి కల్పించింది. అయితే, దేశంలోని ఒక వర్గం ప్రజలు ఆయనను “ఫీల్డ్ మార్షల్ కాదు ఫెయిల్డ్ మార్షల్” అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

పీటీఐ మద్దతుదారులు నిరసన

ఈ నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, పీటీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఆసిమ్ మునీరే కారణమని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మునీర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే, వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వెలుపల కూడా పీటీఐ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Read Also: Iran: వివాదాలకు కేంద్రంగా మారిన ఇరాన్ హార్ముజ్ జలసంధి

#telugu News against Army Chief America Ap News in Telugu Asim Munir Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Strong protest Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.