📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Starlink: త్వరలో భారత్‌ కు స్టార్‌లింక్

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లో డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించి మరో చారిత్రాత్మక ముందడుగు పడింది.టెలికం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చే శక్తి ఉన్న స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. ఎలాన్ మస్క్(Elon Musk)నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఈ కంపెనీ ద్వారా దేశం నలుమూలలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే అవకాశాలు మెరుగయ్యాయి. అడవులు, హిమానీనదాలు, కొండప్రాంతాలు, మారుమూల గ్రామాలు, ఎడారులు అన్న తేడా లేకుండా స్టార్‌లింక్ సేవలతో ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యమవుతుంది.

స్టార్‌లింక్ ఎంట్రీ

ప్రపంచం నలుమూలలకూ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్‌ రుపందుకుంటోంది.స్టార్‌లింక్ ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్పెయిన్, ఇటలీ, మెక్సికో, పోర్చుగల్, బ్రెజిల్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్‌, చిలీ, నార్వే, స్వీడన్ దేశాల్లో సర్వీసులను ప్రారంభించింది. ఎట్టకేలకు ఇప్పుడు భారతదేశంలోకి కూడా స్టార్‌లింక్ ఎంట్రీ ఇచ్చింది. అయితే చాలామంది శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది స్టార్ లింకే అని అనుకుంటున్నారు. నిజం ఏమిటంటే? ఎలాన్ మస్క్ పుట్టకముందే దీనికి సంబంధించిన కసరత్తు అమెరికాలో మొదలైంది.

హ్యూజ్స్ నెట్‌వర్క్

1960వ దశకంలోనే అమెరికా రక్షణ శాఖ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి సైనిక కమాండ్ సెంటర్లకు సమాచారాన్ని పంపడంపై అప్పట్లో ట్రయల్స్ నిర్వహించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 1962 జులై 10న టెల్ స్టార్ – 1 పేరుతో కమ్యూనికేషన్ శాటిలైట్‌‌ను ప్రయోగించింది. ఆ శాటిలైట్‌ ద్వారా అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలోని ప్రజల ఇళ్లకు టీవీ సిగ్నళ్లను ప్రసారం చేశారు. ఇక ఇంటర్నెట్ సేవలను(Internet services) అందించే తొలి శాటిలైట్‌ను 1996లో అమెరికాకు చెందిన హ్యూజ్స్ నెట్‌వర్క్ సిస్టమ్ అనే కంపెనీ ప్రయోగించింది. ఈ శాటిలైట్ ద్వారా ఉత్తర అమెరికాలోని ఇళ్లు, ఆఫీసులకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ను ప్రసారం చేశారు. ఈ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు చిన్నపాటి శాటిలైట్ డిష్‌లను ఆయా ఇళ్లు, ఆఫీసులపై అప్పట్లో ఏర్పాటు చేశారు. హ్యూజ్స్ నెట్‌వర్క్ సిస్టమ్ భూమికి 22వేల మైళ్ల ఎత్తు నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ సిగ్నల్ కవరేజీని అందిస్తోంది.

ఇంటర్నెట్ కనెక్షన్‌

శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రయత్నాలు 1996లోనే మొదలైనప్పటికీ అవి విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. మారుమూల ప్రాంతాలకు వాటిని చేర్చేందుకు ప్రత్యేక కసరత్తు జరగలేదు. దీంతో ఉన్నత వర్గాల వారికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. స్టార్‌లింక్(Starlink) ద్వారా ఈ పరిమితులను అధిగమించేలా ఆలోచన చేసిన ఘనుడు ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. ఆయన ఇంటర్నెట్ కనెక్షన్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు సముద్ర గర్భం, అండర్ గ్రౌండ్‌ మొదలుకొని ఇంటి కిటికీ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరం అవుతాయి. టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో నెట్‌వర్క్ నిర్మాణం అనేది భారీ వ్యయంతో కూడుకున్న పని. ఇవేం లేకుండానే మనిషి వెళ్లడానికి కష్టమైన మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను ప్రసారం చేయడమే మస్క్​ ‘స్టార్​లింక్’ ప్రత్యేకత.

శాటిలైట్ల నెట్‌‌వర్క్‌

స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఎలాన్ మస్క్‌దే. ఈ కంపెనీ 2019 నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 7వేలకుపైగా స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి దిగువ కక్ష్య(LEO)లో తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్- 9’ రాకెట్ ఒకేసారి 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అందుకే కేవలం ఆరేళ్ల వ్యవధిలో 7వేలకుపైగా శాటిలైట్ల నెట్‌‌వర్క్‌ను స్టార్‌లింక్ తయారు చేసుకోగలిగింది. ఒక్కో ఉపగ్రహం 259 కేజీల బరువు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో తమ శాటిలైట్ల సంఖ్యను 42వేలకు పెంచాలని ఎలాన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా మరింత నాణ్యమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని భావిస్తున్నారు.

స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుందంటే

స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో ఉన్న 7వేల ఉపగ్రహాలే ఆధారం. ఈ శాటిలైట్లతో కూడిన స్టార్‌లింక్ నెట్‌వర్క్ అంతరిక్షంలోని శూన్యత ద్వారా రేడియో సిగ్నల్‌లను ఉపయోగిస్తుంది. స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లు తమ ఉపగ్రహాలకు రేడియో సిగ్నల్స్‌ను పంపుతాయి. ఈ రేడియో సిగ్నల్స్‌ను అందుకోగానే స్టార్‌లింక్ శాటిలైట్లు ఇంటర్నెట్ డేటాను భూమిపై వివిధ చోట్ల ఉన్న యూజర్ల డివైజ్‌లకు చేరవేస్తాయి. అందుకే స్టార్‌లింక్ యూజర్లు విమానంలో, అడవుల్లో, ఎడారుల్లో, హిమానీనదాల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో ఉన్నా హై స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిపోవచ్చు. స్టార్‌లింక్ ఉపగ్రహాలన్నీ భూమి దిగువ కక్ష్యలో పక్కపక్కనే ఉంటాయి. ఈ కారణం వల్ల ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా మన డివైజ్‌లకు చేరుతాయి. వీడియో కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్‌లో అస్సలు ఆటంకం ఏర్పడదు.

Read Also: Bihar: సస్పెండ్ అయిన బిహార్​ పోలీస్​ ఇంట్లో భారీ ఆయుధాలు

#ElonMusk #SatelliteInternet #StarlinkIndia #StarlinkRevolution Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.