📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Gaza War: యుద్ధంతో నష్టపోయిన వారికీ అండగా ఉండండి: ట్రంప్ పిలుపు

Author Icon By Vanipushpa
Updated: May 17, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్(Bharath, Pakistan) మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అలాగే ఇజ్రాయెల్- హమాస్ (Isarel, Hamas) మధ్య ఏళ్లకుఏళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్దం కారణంగా గాజాలోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని.. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని అన్నారు. ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో జరుగుతున్న మానవీయ సంక్షోభంపై స్పందించారు.

Gaza War: యుద్ధంతో నష్టపోయిన వారికీ అండగా ఉండండి: ట్రంప్ పిలుపు

ట్రంప్ వ్యాఖ్యలు: గాజాలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో బాధితులకు అండగా నిలవాలి. అమెరికా ప్రభుత్వం వచ్చే నెలలో గాజా ప్రజల కోసం సహాయ చర్యలకు సిద్ధంగా ఉంది. యుద్ధం కారణంగా గాజాలోని అనేక మంది ప్రజలకు ఆహారం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికోసం నెల రోజుల్లో మంచి పనులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమైంది. పాలస్తీనా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గాజాలోని ఎంతో మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. త్వరలో వారికోసం మంచి చేస్తాం” అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
కరవుతో అల్లాడుతున్న గాజా ప్రజలు
మరోవైపు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP).. ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని వివరించింది. మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ తో ఉన్నారని వివరించింది.
దాడుల్లో 82 మంది మృతి
మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, దేర్‌ అల్‌బలా నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గత రెండు రోజుల నుంచి జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్‌ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది.

Read Also: Turkey: బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu heir lives in war Latest News in Telugu Paper Telugu News Stand by those Telugu News online Telugu News Paper Telugu News Today Trump's call who have lost

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.