భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో ఆరేళ్ల తర్వాత శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అతను వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన యుషి తనకపై 21-18 , 24-22 స్కోరుతో నెగ్గాడు. 2019 తర్వాత శ్రీకాంత్(KidambiSrikanth) తొలిసారి బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లోకి ఎంట్రీఇచ్చాడు. గతంలో వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న 32 ఏళ్ల ఆ ప్లేయర్ మళ్లీ చాన్నాళ్ల తర్వాత టాప్ ఆటను కనబడిచాడు. ప్రస్తుతం అతను 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఓ దశలో ఈ టోర్నీ కోసం అతను క్వాలిఫైయర్స్ ఆడాల్సి వచ్చింది.
ఫిట్‌నెస్
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడలిస్ట్ అయిన శ్రీకాంత్ వరల్డ్ నెంబర్ 23 తనకపై వరుస గేమ్‌ల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. 2017లో అతను బీడబ్ల్యూఎఫ్(BWF) నాలుగు టైటిళ్లు గెలిచాడు. గత కొన్ని సీజన్ల నుంచి శ్రీకాంత్ తడబడ్డాడు. ఫామ్, ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు.
Read Also: Abhishek Sharma: టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ అత్యధిక స్కోర్ ఘనత