📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Iran: ఇరాన్ లో అధికార మార్పుపై పెరుగుతున్న ఊహాగానాలు

Author Icon By Vanipushpa
Updated: June 19, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్-అమెరికా(Iran-America) మధ్య అణు ఒప్పందం చర్చలు జరుగుతున్న అకస్మాత్తుగా క్షిపణలు సంధించి యుద్ధానికి తెరలేపిన ఇజ్రాయెల్ దాన్ని రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇరాన్ అణుస్ధావరాలు, శాస్త్రవేత్తల లక్ష్యంగా ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు ఆ దేశంలోని చమురు నిల్వలపైకీ మళ్లింది. మరోవైపు తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ లో ఏమీ మిగలదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ లో అధికార మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రాధాన్యం సంతరించుకున్న ప్రిన్స్ రెజా పహ్లావీ వ్యాఖ్యలు
ఇరాన్ పై పోరాటంలో ఇజ్రాయెల్ కు సహకరించేందుకు సిద్దమవుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సుప్రీం లీడర్ ఖమేనీ(Khameni)ని బేషరతుగా లొంగిపోవాలని కోరడం, ఆయన ససేమిరా అనడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ పై దాడులు చేసి ఖమేనీని అంతం చేసేందుకు లేదా కనీసం అధికార మార్పిడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మద్దతుగా ఖమేనీ కంటే ఇరాన్ పాలకుడిగా ఉన్న షా కుమారుడు, దేశ బహిష్కిృతుడైన ప్రిన్స్ రెజా పహ్లావీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Iran: ఇరాన్ లో అధికార మార్పుపై పెరుగుతున్న ఊహాగానాలు

ఎలుకలాగా భూగర్భంలో దాక్కున్న ఖమేనీ: పహ్లావీ
ఇజ్రాయెల్ తో యుద్దం ముదురుతున్న వేళ ఇరాన్ ప్రజలనుద్దేశించి షా కుమారుడు రెజా పెహ్లావీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ దాని ముగింపుకు వచ్చిందని, కూలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, కలిసి మనం చరిత్ర పేజీని తిప్పుతామని తెలిపారు. భయపడిన ఎలుకలాగా ఖమేనీ భూగర్భంలో దాక్కున్నాడని, దేశంపై నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.

అధికార మార్పిడికి చేస్తున్న ప్రయత్నాలకు బలం

సంవత్సరాలుగా, మన మాతృభూమి యుద్ధ అగ్నికి ఆహుతి కాకుండా నిరోధించడానికి తాను ప్రయత్నించానని, ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు అంటే ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా దాని 46 సంవత్సరాల యుద్ధం ముగింపే అన్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినా ఇప్పటికీ ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా పరిగణించబడుతున్న రెజా పహ్లావి.. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా అధికార మార్పిడికి చేస్తున్న ప్రయత్నాలకు బలం చేకూరేలా ఉంది. మరోవైపు ఖమేనీ నేతృత్వంలోని పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా తిరుగుబాటు చేయాలని పహ్లావి పిలుపునిచ్చారు.

Read Also: Nara Lokesh: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ భేటీ..ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu change in Iran Google News in Telugu Latest News in Telugu over regime Paper Telugu News Speculation grows Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.