📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Modi: మోదీపై సోఫియా ఖురేషీ కుటుంబం పూలవర్షంతో అభిమానం వ్యక్తం

Author Icon By Vanipushpa
Updated: May 26, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని మోదీ(PM Modi) వడోదర(Vadodara) పర్యటన వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindoor) తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) గుజరాత్‌(Gujarath)లో పర్యటనకు వచ్చారు. గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షో లో పాల్గొన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని పై పూల వర్షం కురిపించారు. ఆపరేషన్ సింధూర్ తరువాత తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. వడోదరలో జరిగిన రోడ్ షో లో ఊహించని రీతిలో ప్రధాని మోదీకి స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో వడోదర ప్రజలు త్రివర్ణ పతాకాలతో భారీగా తరలి వచ్చారు. మోదీ అనుకూల నినాదాల తో హోరెత్తించారు. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు.

ప్రత్యేక ఆకర్షణగా ఖురేషీ కుటుంబం
కాగా.. సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. సైన్యం సాధించిన విజయాలను ప్రజల కు తెలియ చేసిన సమయంలో సోఫియా ఖురేషీ దేశ ప్రజల మన్ననలను అందుకున్నారు.
సైనికాధికారిగా కల్నల్ సోఫియా ఖురేషికి మంచి రికార్డు ఉంది. ఆ తరువాత కొందరు బీజేపీ నేతలు సోఫియా పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ సమయంలో యావత ప్రజలు సోఫియాకు మద్దతుగా నిలిచారు. కోర్టులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలను తీవ్రంగా మంద లించాయి. సోఫియా ఖురేషీ వడోదర చెందినవారు.

నాకు గర్వంగా వుంది :సోఫియా తల్లి
ఆమె కుటుంబీకులు అక్కడే స్థిరపడ్డారు. మహిళల సింధూరం కోసం తన కూతురు యుద్ధం చేయడం తనకు గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు. ఇక, ఆపరేషన్ సింధూర్ తరువాత వడోదరకు ప్రధాని వస్తుండటంతో సోఫియా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. మోదీపై కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు. ఈ సంఘటన ప్రధానిగా మోదీ ప్రజల్లో ఎంత ప్రాచుర్యం పొందారో, మరియు సోఫియా ఖురేషీ వంటి దేశభక్తులను గౌరవించడంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టంగా చూపించింది. తన కూతురు దేశ సేవలో చేసిన పోరాటం పట్ల గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు.ప్రధాని మోదీ వస్తున్నట్లు తెలిసి, కుటుంబం ప్రత్యేకంగా పాల్గొని ఆయనపై పూలవర్షం కురిపించింది. ఈ దృశ్యం ప్రధాని మోదీని కూడా భావోద్వేగానికి గురిచేసింది. ఆయన కుటుంబానికి అభివాదం చేశారు.

.Read Also: Pakistan: పాత చైనా సైనిక చిత్రాన్ని ప్రధానికి బహుమతిగా ఇచ్చిన పాక్ ఆర్మీ చీఫ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu expressing their admiration family showered flowers Google News in Telugu Latest News in Telugu on Modi Paper Telugu News Sophia Qureshi's Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.