📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shubman Gill: రెండో టెస్ట్ లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు శతకాలు సాధించిన అత్యంత పిన్న వయస్సు ఆసియా కెప్టెన్‌ (Asian captain) గా చరిత్ర సృష్టించాడు. గిల్ ఈ ఘనతను ఆయన 25 ఏళ్ల 297 రోజుల వయస్సులోనే అందుకోవడం విశేషం.ఇంగ్లీష్ గడ్డపై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించడం ద్వారా శుభ్‌మన్ గిల్ ఈ ఘనతను అందుకున్నాడు.ఇంగ్లండ్ పర్యటనతోనే టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ తొలి టెస్ట్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించిన గిల్ 199 బంతుల్లో మూడుంకెల స్కోర్ అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కన్నా ముందు సౌతాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ పర్యాటక జట్టు కెప్టెన్‌గా 22 ఏళ్ల 180 రోజుల వయసులో ఇంగ్లండ్ గడ్డపై రెండు సెంచరీలు నమోదు చేశాడు. 

ఎక్కువ సెంచరీలు

2003లో సౌతాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనలో అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్(2), శుభ్‌మన్ గిల్(2) తర్వాత జావెద్ బుర్కీ(పాకిస్థాన్), బిల్లీ(ఆస్ట్రేలియా) ఒక్కో సెంచరీతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ గడ్డపై ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో భారత కెప్టెన్ గిల్ నిలిచాడు. అతని కంటే ముందు మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీలు కెప్టెన్‌గా రెండేసి సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లండ్ గడ్డపై వరుసగా సెంచరీలు నమోదు చేసిన మూడో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అతని కన్నా ముందు అజారుద్దీన్ (1990లో), విజయ్ హజారే (Vijay Hazare) (1952) ఈ ఫీట్ సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. 

Shubman Gill: రెండో టెస్ట్ లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

రెండు వికెట్లు

కెప్టెన్ శుభ్‌మన్ గిల్(216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) అజేయ శతకంతో చెలరేగగా యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(2/59) రెండు వికెట్లు తీయగా బ్రైడన్ కార్స్ (Brydon Cars), బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్‌తో తొలి రోజు ఆటలో టీమిండియా గట్టెక్కింది.

Read Also: Mohammed Shami: షమీకి షాక్.. భార్యకు నెలకు రూ.4 లక్షల భరణం

#AndersonSachinTrophy #BackToBackCenturies #CricketRecords #GillCentury #GillInEngland #IndianCricket #INDvsENG #ShubmanGill2025 Let me know if you want a short caption or headline for social media too. #TeamIndia #TestCricket #YoungestAsianCaptain Anderson-Sachin Trophy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Here are the **English SEO keywords** and **hashtags** for your content on Shubman Gill: ### ???? **Keywords:** Shubman Gill century India Tour of England 2025 India vs England Test 2025 Indian cricket captain milestones Latest News in Telugu Paper Telugu News Shubman Gill back-to-back centuries Shubman Gill Century Shubman Gill record in England Shubman Gill Test hundred Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Test Cricket Records youngest Asian captain record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.