📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: ఫోకస్‌ వల్లే రికార్డు ఇన్నింగ్స్ సాధ్యమైంది: గిల్

Author Icon By Anusha
Updated: July 4, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తరువాత టెస్ట్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించటం ద్వారా తాను డబుల్ సెంచరీ సాధించగలిగానని టీమిండియా (Team India) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. తాను కొన్ని కీలకమైన అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టానని, టెస్ట్ ఫార్మాట్‌కు అవసరమైన ప్రిపరేషన్, మైండ్‌సెట్‌ను అభివృద్ధి చేసుకున్నానని ఆయన స్పష్టం చేశాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం తాను మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడ్డానని గిల్ వెల్లడించాడు. “ఐపీఎల్ ముగిసిన వెంటనే నా దృష్టంతా టెస్ట్ క్రికెట్‌పై పెట్టాను. రోజూ లాంగ్ నెట్ సెషన్స్, స్టామినా బిల్డింగ్, బౌలర్ల‌ను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై వ్యూహాత్మకంగా పనిచేశాను,” అని గిల్ మీడియాతో పంచుకున్నాడు.ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా (Edgbaston Venue) జరుగుతున్న రెండో టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.

రెండో రోజు ఆట అనంతరం అధికారికి బ్రాడ్‌కాస్టర్‌తో

తొలి టెస్ట్‌లో శతకం బాదిన గిల్ రెండో టెస్ట్‌లో ద్విశతకం సాధించాడు. దాంతో ఈ మ్యాచ్‌‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) స్లిప్‌లో అద్భుతంగా అందుకున్నాడు.రెండో రోజు ఆట అనంతరం అధికారికి బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శుభ్‌మన్ గిల్, ఈ మ్యాచ్‌పై పట్టు బిగించామని చెప్పాడు. ఫీల్డింగ్ మెరుగ్గా చేస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘ప్రస్తుతం మేం మంచి పొజిషన్‌లో ఉన్నాం. ఐపీఎల్ తర్వాత నేను టెస్ట్ క్రికెట్‌కు కావాల్సిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాను.

నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది

చాలా కష్టపడ్డాను. దానికి ఈ సిరీస్‌లో ప్రతిఫలం దక్కుతుంది. బ్యాటింగ్ చేసే సమయంలో వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలవాలని అనుకున్నాను. ఆటను ఆస్వాదించాలని భావించాను. దాంతోనే డబుల్ సెంచరీ (Double century) సాధించగలిగాను. స్లిప్ క్యాచ్ అందుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ కారణంగా గత రెండు రోజులుగా నేను స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయలేదు. అయినా క్యాచ్‌ అందుకున్నాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫీల్డింగ్ చాలా కీలకం. గత మ్యాచ్‌లో మేం వదిలేసిన క్యాచ్‌ల్లో సగం పట్టినా ఫలితం మరోలా ఉండేది.’ అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

read hindi news: hindi.vaartha.com

Read Also: Shubhman Gill: శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఏమన్నారంటే?

Ap News in Telugu Breaking News in Telugu Edgbaston Test 2025 Gill batting records Gill century and double century Gill hard work pays off Gill in England tour Gill performance analysis Gill Test performance Google News in Telugu India 587 runs India England Test series India vs England 2nd Test Indian Cricket Updates IPL 2025 impact IPL to Test transition Latest News in Telugu Paper Telugu News Shubman Gill double century Shubman Gill focus areas Shubman Gill statement Team India captain Gill Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Test cricket preparation Test match highlights Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.