📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Donald Trump: భారతీయులు ఇక అమెరికా వీసాపై ఆశలు వదులుకోవాలిసినదేనా?

Author Icon By Vanipushpa
Updated: April 15, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే షాకులకు అటు ప్రపంచ దేశాలు, ఇటు వలసవాదులు అల్లకల్లోలం అవుతున్నాయి. గ్యాప్ ఇవ్వకుండా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అమెరికా వెళ్లాలన్న ప్రపంచ దేశాల యువతకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికాలో హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. వారికి భారీ షాక్ ఇచ్చారు. EB-5 అన్ రిజర్వ్ డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని ఆరు నెలలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా దేశస్థులకు మాత్రం కటాఫ్ డేట్ మార్చలేదు అమెరికా యంత్రాంగం. కానీ భారతీయులకు మాత్రం 2019 నవంబరు 1 నుంచి 2019 మే 1కి కుదించింది. ఈ నిర్ణయంతో భారతీయులపైనే కక్ష కట్టినట్లుగా వ్యవహరించింది అమెరికా యంత్రాంగం.

హెచ్-1బీ వీసాకు అవకాశం తగ్గుతున్నాయి
ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో గ్రీన్ కార్డు లేదా హెచ్-1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి అది లభించే అవకాశం మరింత సన్నగిల్లనుంది. ఇటీవలే అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందేనని కొత్త యుఎస్ ఇమిగ్రేషన్ రూల్ తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. ఈ రూల్ ప్రకారం.. యూఎస్ లో నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా తమ వెంట ఐడి కార్డులు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్టడీ వీసా, ట్రావెల్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒకవేళ హెచ్1 బీ వీసా దారులు అయితే హెచ్1 బీ వీసా, గ్రీన్ కార్డు సహా వివిధ కేటగిరీల వీసాలు ఉన్నవారు ఎవరైనా సరే వారితోపాటు నిరంతరం వారి గుర్తింపు కార్డులు కూడా వెంట పెట్టుకోవాలని అధికారులు సూచించారు.

విదేశీయులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మరోవైపు అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది. అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

వేలిముద్రలు & రిజిస్ట్రేషన్
ఏప్రిల్ 11 తర్వాత అమెరికా వెళ్లే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి.
లేకపోతే భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించబడే అవకాశం ఉంది. ఇది అమెరికాలో కొత్తగా ప్రవేశిస్తున్న వలసదారులకు మరింత భారంగా మారనుంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ విధానాలు వలస విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి. భారతీయుల కోసం EB-5 వీసా అన్ రిజర్వ్డ్ విభాగంలోని కటాఫ్ డేట్‌ను 2019 నవంబరు 1 నుండి 2019 మే 1కి కుదించారు. ఈ మార్పు భారతీయులకు తీవ్ర నష్టంగా మారింది. చైనీయులకు మాత్రం ఇదే డేట్ కొనసాగిస్తుండటంతో భారతీయులపై కక్షతీర్చేలా కనిపిస్తోంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Trump Tariff: ఫార్మాసూటికల్స్ రంగంపై ట్రంప్ భారీ టారిఫ్

    #telugu News Ap News in Telugu Breaking News in Telugu give up hope Google News in Telugu Latest News in Telugu on US visas? Paper Telugu News Should Indians Telugu News online Telugu News Paper Telugu News Today

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.